నమ్మొద్దు.. నట్టేట ముంచేవాళ్లని..

నమ్మిన స్నేహితురాలే నట్టేట ముంచింది. అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియోలు తీసి బోయ్‌ఫ్రెండ్‌కి పంపింది. పరువు పోయిందని ఏడ్వడం ఆ అమ్మాయిల వంతైంది. చంఢీగఢ్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన దారుణమిది. అక్కడే కాదు.. ఫ్రెండ్‌ రూపంలో ఉండే ఫ్రెనెమీలు మన పక్కనే ఉంటారు. మరి వాళ్లని గుర్తించేదెలా?

Published : 24 Sep 2022 01:56 IST

నమ్మిన స్నేహితురాలే నట్టేట ముంచింది. అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియోలు తీసి బోయ్‌ఫ్రెండ్‌కి పంపింది. పరువు పోయిందని ఏడ్వడం ఆ అమ్మాయిల వంతైంది. చంఢీగఢ్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన దారుణమిది. అక్కడే కాదు.. ఫ్రెండ్‌ రూపంలో ఉండే ఫ్రెనెమీలు మన పక్కనే ఉంటారు. మరి వాళ్లని గుర్తించేదెలా?

* తమకన్నా అందం, తెలివితేటలు, మంచితనం ఉంటే వీళ్లు తట్టుకోలేరు. నేరుగా కాకుండా ఆ గుణగణాలను చులకనగా చూస్తారు. ఇతరులు విజయాలు సాధిస్తే వాటిని తక్కువ చేసి చెబుతుంటారు.

* మన ముందు ఒకలా వెనక మరోరకంగా ఉంటారు. స్నేహం నటిస్తూ తీయగా మాట్లాడతారు. వెనకాల విషం చిమ్ముతారు. ఇతరులతో మన గురించి చెడుగా చెబుతుంటారు.

* మాటలతో మభ్యపెట్టి వ్యక్తిగత విషయాలు కూపీ లాగుతారు. మన రహస్యాలు, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు.. ఏదోరకంగా చేజిక్కించుకుంటారు. మనకు నచ్చని వ్యక్తుల గురించి మరింత చెడుగా చెబుతూ సాయం చేస్తున్నట్టు పోజు కొడతారు.

* ‘మందు కొట్టకపోతే మగాడివే కాద’ంటారు. ‘పొగ తాగడం ఫ్యాషన్‌’ అంటుంటారు. పబ్‌కి వెళ్లకపోతే యూతే కాదంటారు. వాళ్లు చెడుదారి పట్టింది కాకుండా స్నేహితుల్నీ ఈ రొంపిలోకి లాగుతుంటారు.

* స్మార్ట్‌ఫోన్‌, బైక్‌, ల్యాప్‌టాప్‌ లాంటి ఖరీదైన వస్తువులను కావాలనే పాడు చేస్తారు. ‘అయ్యో.. అనుకోకుండా ఇలా జరిగింద’ని అమాయకత్వం నటిస్తారు.

* వీరిలో ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌ ఎక్కువ. ‘అంతేలే.. నేను చెబితే ఎందుకు వింటావు?’ నేనేమైనా నీ బెస్ట్‌ ఫ్రెండ్‌నా?’ అనే మాటలు ఎక్కువ వాడుతుంటారు. ఇరకాటంలో పడేస్తూ అనుకున్నవన్నీ సాధించుకుంటారు.

* పర్స్‌ మర్చిపోయానంటూ ఖర్చు పెట్టిస్తారు. అత్యవసరం అంటూ అందినకాడికి లాగుతారు. మనకి అవసరం వచ్చినప్పుడు మాత్రం మొహం చాటేస్తారు.

* ఏదైనా మంచి ప్రయత్నం చేసినప్పుడు ‘అది మనకి సెట్‌ కాదు’, ‘నీవల్ల కాదులే. సమయం వృథా’ అని నిరుత్సాహ పరుస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు