ఆహా..అలాగా!

అబ్బాయిలు సినిమాలాంటోళ్లు.. రెండున్నర గంటల్లో అర్థమవుతారు. అమ్మాయిలు టీవీ సీరియల్‌లాంటి వాళ్లు.. ఏళ్లు గడిస్తేగానీ అర్థం చేసుకోలేం.

Published : 15 Oct 2022 00:26 IST

* అబ్బాయిలు సినిమాలాంటోళ్లు.. రెండున్నర గంటల్లో అర్థమవుతారు. అమ్మాయిలు టీవీ సీరియల్‌లాంటి వాళ్లు.. ఏళ్లు గడిస్తేగానీ అర్థం చేసుకోలేం.
* ఒకప్పుడు క్లాసులో ఫోన్‌ వాడొద్దు అనేవారు. ఇప్పుడు ఫోన్‌లోనే క్లాసులు చెబుతున్నారు.
* ప్రపంచానికి కరోనా నేర్పిన పాఠం ఏంటో తెలుసా? డబ్బు కన్నా సబ్బు గొప్పదని.. జబ్బుల్ని ఆపుతుందని.
* వాట్సప్‌ స్టేటస్‌లో ఒకటో, రెండో ఫొటోలు పెడితేనే ఆసక్తి. గూడ్స్‌ ట్రైన్‌ బోగీలా పెడితే ఎవరు చూస్తారు?
* కొన్నేళ్ల కిందట స్కూల్లో పాఠాలు చెప్పేది ఒక్క గురూజీనే. ఇప్పుడు 3జీ, 4జీ, 5జీలు ఉంటేగానీ తరగతులు ముందుకెళ్లడం లేదు.

- ఎస్‌.మురళీకృష్ణ, వైజాగ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని