ముగ్గురిలో ఒకరు ఫేక్‌

నిద్ర లేచింది మొదలు.. పడక ఎక్కేదాకా ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో విహరిస్తూనే ఉంటారు యూత్‌. అయితే ఈ సోషల్‌మీడియాని వాడే కుర్రకారులో ముగ్గురిలో ఒకరు నకిలీ వివరాలతో ఖాతాలు ప్రారంభిస్తున్నారట. ‘వాచ్‌డాగ్‌ ఆఫ్‌కామ్‌’ అనే బ్రిటన్‌ సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Updated : 02 Nov 2022 10:53 IST

నిద్ర లేచింది మొదలు.. పడక ఎక్కేదాకా ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో విహరిస్తూనే ఉంటారు యూత్‌. అయితే ఈ సోషల్‌మీడియాని వాడే కుర్రకారులో ముగ్గురిలో ఒకరు నకిలీ వివరాలతో ఖాతాలు ప్రారంభిస్తున్నారట. ‘వాచ్‌డాగ్‌ ఆఫ్‌కామ్‌’ అనే బ్రిటన్‌ సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
* సామాజిక మాధ్యమాల్లో కొత్తగా ఖాతా ప్రారంభిస్తున్నవాళ్లలో 77శాతం మంది 10 నుంచి 17 ఏళ్ల వయస్కులే వయసు, పుట్టిన తేదీ, లింగం.. ఈ విషయాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నకిలీ వివరాలు పొందుపరుస్తున్నారు.
* 12 ఏళ్లలోపు పిల్లల్లో అత్యధికులు తమ తల్లిదండ్రులు, సంరక్షకుల సాయంతో కొత్త ఖాతాలు ప్రారంభిస్తున్నారు.
* కొత్తగా ఖాతాలు ప్రారంభిస్తున్న వాళ్ల సగటు వయసు 13 సంవత్సరాలు.
* ఎదుటివాళ్లని ఆకట్టుకోవాలి.. అనుభవజ్ఞుల్లా పోజు కొట్టాలి.. మా ఉనికి తెలియొద్దు అనే ఉద్దేశంతో ఎక్కువమంది వయసు, ప్రాంతం, ఆడామగా వివరాలు తప్పుగా ఇస్తున్నారట.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని