86 రోజుల ప్రేమ!

మనసులు కలిస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమలో పడిపోవడం సహజం. మరి ముందు ఎవరు పడిపోతారు? అంటే.. అమ్మాయి ఆకట్టుకునే రూపానికో.. సోగ కళ్ల సైగలకో.. అబ్బాయిలే టపీమని పడిపోతారట

Published : 22 Oct 2022 00:10 IST

మనసులు కలిస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమలో పడిపోవడం సహజం. మరి ముందు ఎవరు పడిపోతారు? అంటే.. అమ్మాయి ఆకట్టుకునే రూపానికో.. సోగ కళ్ల సైగలకో.. అబ్బాయిలే టపీమని పడిపోతారట. దీని వెనకాల కెమికల్‌ చేసే మిరకల్‌ ఉందంటోంది తాజా అధ్యయనం.

ఒకమ్మాయి ఎవరైనా అబ్బాయిని ఇష్టపడ్డప్పుడు తన శరీరంలో ఒత్తిడి హార్మోన్‌, లవ్‌ కెమికల్‌.. విడుదలవుతాయట. ప్రేమ హార్మోన్‌ మనసులో మాట చెప్పమని పోరు పెడుతుంటే.. ఒత్తిడి హార్మోన్‌ వెనక్కి లాగుతుంది. అదే అబ్బాయిల విషయానికొస్తే వాళ్లలో ఒత్తిడి హార్మోన్‌ జాడే ఉండదు. అందుకే అబ్బాయిలు తమ భావాలను త్వరగా పంచుకుంటుంటే.. అమ్మాయిలు గుంభనంగా ఉంటారని సర్వేలో తేలింది. ఇక కుర్రాడు అతివ అందానికే ఫిదా అయిపోతే.. అబ్బాయి వ్యక్తిత్వం, గుణగణాలు నచ్చితేగానీ.. అతడిపై నమ్మకం కుదిరి దగ్గరవడానికి అమ్మాయిలు ఇష్టపడరట. అదీగాక ఓసారి లవ్‌లో ఫెయిలై దేవదాసులైన కుర్రాళ్లు సగటున 86 రోజుల్లోనే హృదయంలోని బాధను మర్చిపోతుంటే.. మహిళలు మాత్రం ఇష్టసఖుడిని 141 రోజుల దాకా గుర్తు చేసుకుంటూనే ఉంటారట. అందుకే అబ్బాయిలు మళ్లీమళ్లీ ప్రేమలో పడిపోవడానికి సిద్ధమవుతుంటే... అమ్మాయిలు ఆచితూచి స్పందిస్తారట. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న దాదాపు వేయిమంది ప్రేమికులు, విఫల ప్రేమికులతో మాట్లాడాక ఈ ఫలితాలు వెల్లడించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు