సెల్‌ఫోన్‌ స్నేహితులీ యాప్‌లు!

సెల్‌ఫోన్‌ లేకుండా కుర్రకారుకి క్షణం గడవని రోజులివి. సెల్ఫీలు, సినిమాలు, షాపింగ్‌.. అన్నీ అరచేతిలోనే. అందుకే మొబైల్‌కి ఎక్కువ జీబీ సామర్థ్యం కావాలి. ‘జంక్‌’ని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.

Published : 22 Oct 2022 00:24 IST

సెల్‌ఫోన్‌ లేకుండా కుర్రకారుకి క్షణం గడవని రోజులివి. సెల్ఫీలు, సినిమాలు, షాపింగ్‌.. అన్నీ అరచేతిలోనే. అందుకే మొబైల్‌కి ఎక్కువ జీబీ సామర్థ్యం కావాలి. ‘జంక్‌’ని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. ఆ పనిని బాగా చేసే ఆండ్రాయిడ్‌ క్లీనర్‌ యాప్‌లు ఇవి.
*ఫైల్స్‌: ఇది గూగుల్‌ సంస్థ అధికారిక యాప్‌. డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వాడటం తేలిక. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వేసిన తర్వాత యాప్‌ కిందిభాగంలో ఉండే ‘క్లీన్‌’ అనే బటన్‌ని నొక్కితే చాలు. జంక్‌ ఫైల్స్‌, డూప్లికేట్స్‌, వాడని యాప్‌లు.. అన్నింటి వివరాలు చూపిస్తుంది. ఏవి వద్దనుకుంటే అవి తొలగించుకోవచ్చు. కొన్ని ఫోన్లలో ఈ యాప్‌ ఇన్‌బిల్ట్‌గా వస్తోంది.
* సి-క్లీనర్‌: వాడని యాప్‌లు, ఖాళీ ఫోల్డర్లు, క్యాచెని ప్రక్షాళన చేయడమే కాదు.. కావాలనుకుంటే ఫోన్‌లో మనం చూసిన వెబ్‌సైట్ల హిస్టరీని తొలగిస్తుంది. ఇందులోని యాప్‌ మేనేజర్‌ మొబైల్‌లోని ముఖ్య భాగాల వివరాలు, అంకెలు చూపిస్తుంది.
* ఆల్‌ ఇన్‌ వన్‌ టూల్‌బాక్స్‌: క్యాచె, ఖాళీ ఫోల్డర్లు, జంక్‌ని తొలగిస్తుంది. ఈ విధులతోపాటు బ్యాటరీ ఆరోగ్యం బాగా లేకపోయిపోయినా, సీపీయూ వేడెక్కినా ఈ యాప్‌ హెచ్చరికలు పంపిస్తుంది. అనవసరంగా వచ్చిపడే యాడ్స్‌ని మధ్యలోనే ఆపేస్తుంది. ‘బ్యాటరీ సేవర్‌’తో బ్యాగ్రౌండ్‌లో రన్‌ అవుతున్న టాస్క్‌లు అన్నింటినీ ఆపేస్తుంది.
* డ్రాయిడ్‌ ఆప్టిమైజర్‌: ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ యాప్‌లలో ఇదొకటి. పదిలక్షలకు పైగా డౌన్‌లోడ్స్‌ అయ్యాయి. వాడటం తేలిక. ఒక్క బటన్‌తో ఫోన్‌లోని అనవసర జంక్‌ మొత్తం తొలగిస్తుంది. సమయం సెట్‌ చేసి మన ప్రమేయం లేకుండా ఆటోమేటిగ్గానూ ఫోన్‌ జంక్‌ ఫైల్స్‌ని శుభ్రం చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ యాప్‌లు తొలగించే సదుపాయం ఉండటం ఇందులోని ప్రత్యేకత.
* ఎస్‌డీ మెయిడ్‌: సెర్చ్‌బార్‌లోకి వెళ్లి ఏ జంక్‌ ఫైల్‌ని అయినా తొలగించుకునే ఆప్షన్‌ ఉండటం దీని ప్రత్యేకత. మిగతా అన్నింటిలాగే జంక్‌ ఫైల్స్‌, వైరస్‌ తొలగించి ఫోన్‌ సామర్థ్యం పెరిగేలా చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని