రంగు పడితేనే.. రెచ్చిపోతారు

కార్పొరేట్‌, ఐటీ, మార్కెటింగ్‌.. కార్యాలయం ఏదైనా ఈమధ్య చాలా ఆఫీసుల్లో గోడలు నీలం వర్ణంలో మెరిసిపోవడం గమనించారా?

Updated : 05 Nov 2022 04:21 IST

కార్పొరేట్‌, ఐటీ, మార్కెటింగ్‌.. కార్యాలయం ఏదైనా ఈమధ్య చాలా ఆఫీసుల్లో గోడలు నీలం వర్ణంలో మెరిసిపోవడం గమనించారా? ఎందుకీ ట్రెండ్‌ అంటే నీలం రంగు పులుముకుంటే ఉద్యోగుల పనితీరు మెరుగు పడుతుందంటున్నారు నిపుణులు.
ఆ కథేంటి?

* సానుకూలత, సృజనాత్మకతకు నీలం రంగు సంకేతం అని ముందునుంచీ చెబుతున్నారు. ఈ వర్ణం గోడల మధ్య ఉండి పని చేసేవాళ్లు సౌకర్యంగా ఫీలవుతారు, తొందరగా అలసిపోరు అని లుండ్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది * నీలం మనసుకే కాదు.. కళ్లకూ మంచిదట. అంతటా ఇది పరచుకొని ఉంటే.. మెదడు నుంచి సానుకూల సంకేతాలు వెలువడి ఉద్యోగుల ఏకాగ్రత పెరుగుతుందంటున్నారు. లేత నీలం రంగు దుస్తుల్ని ఇష్టపడేవాళ్లు ప్రశాంత చిత్తంతో ఉంటారని తేలింది *బ్లూ రంగు గోడల మధ్య ఎక్కువ కాలం పని చేసేవాళ్లలో కాగ్నిటివ్‌ సామర్థ్యాలు పెరుగుతున్నాయని, పనితీరు మరింత బాగుపడుతోందని 2009లో బ్రిటీష్‌ కొలంబియా యూనివర్సిటీ అధ్యయనంలో నిరూపితమైంది * నీలం, ఇతర రంగుల మిశ్రమాలతో అలంకరించిన గదుల్లో పని చేసినా మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు అధ్యయనకారులు. లేత పసుపు, ఎరుపు రంగులు సైతం సానుకూలంగా ఉంటాయంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని