అబ్బ.. ఛ!

చదివి బాగు పడండ్రా అని పుస్తకాలు కొనిస్తే ఎవరూ చదవరు. పక్కింటి అమ్మాయి.. ఎదురింటి ఆంటీ స్టేటస్‌ పెడితే మాత్రం వెంటనే తెగ ఉబలాటంగా చదువుతాడు.

Updated : 05 Nov 2022 04:19 IST

(సందర్భం)

*చదివి బాగు పడండ్రా అని పుస్తకాలు కొనిస్తే ఎవరూ చదవరు. పక్కింటి అమ్మాయి.. ఎదురింటి ఆంటీ స్టేటస్‌ పెడితే మాత్రం వెంటనే తెగ ఉబలాటంగా చదువుతాడు.
*ఒకప్పుడు కోపం కళ్లలో.. బాధ గుండెల్లో ఉండేది. ఇప్పుడు ఆవేశం ఫేస్‌బుక్‌ గోడపై.. బాధ వాట్సప్‌ స్టేటస్‌లో కనిపిస్తోంది.
* ఫేస్‌బుక్‌లో ఒక కుర్రాడి సందేశానికి వెంటనే బదులిస్తే తను మంచి మనసున్న అమ్మాయి. తన అసలైన ఫొటో చూపిస్తే దేవకన్య. వాట్సప్‌లో చాట్లాడదాం అని రమ్మని పిలిస్తే.. దేవత.
* నడక ఒంటికి మంచిదని తెలిసినా ఎవరూ వ్యాయామం చేయరు. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌లో ఫ్రీ వై-ఫై అని చెప్పండి.. కిలోమీటర్లకొద్దీ అటూఇటూ నడుస్తూనే ఉంటారు.
* పాపం చేస్తే.. వచ్చే జన్మలో అనుభవిస్తారట. పాపం లవ్‌లో పడ్డ కుర్రాడు మాత్రం పాపతో ఈ జన్మలోనే వేగాలి.

* శ్యామ్‌కుమార్‌, వరంగల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని