కొంటె కొటేషన్‌

ఫొటో కోసం పెట్టావు కాలు... పడితే నువ్వు నవ్వులపాలు!

Published : 12 Nov 2022 00:20 IST

* ఫొటో కోసం పెట్టావు కాలు...
పడితే నువ్వు నవ్వులపాలు!

- మహదేవుని మనోజ్‌కుమార్‌, కొమురవెళ్లి

* సర్దుకున్నావా సరంజామా...
నీ తుది మజిలీ చందమామ!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

* నువ్వు కాలు పెట్టింది మూన్‌...
ఆ ప్రయత్నాలొద్దు మ్యాన్‌!

- పి.సాంబశివారెడ్డి, కడప

* పట్టుజారితే పెట్టిన కాలు...
వదలాలి నీకు తిలోదకాలు!

- కవుటూరి శ్రీలత, నెల్లూరు

* ఇప్పుడే అడుగు మోపావు చంద్రుడిపైకి...
తిరిగి రాగలవా దివిపైకి!

- ఇంతియాజ్‌, ప్రొద్దుటూరు

* అందమైన చందమామ...
అందదు.. కొంచెం జాగ్రత్త మామా!

- రెడ్డి సుధాకర్‌, వైజాగ్‌

* రాకెట్‌ ఎందుకు దండగ...
నీ అడుగు ఉండగా!

- సంపంగి రాము, కల్వకుర్తి

పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని