కడవలతో ఒడిసి పట్టాలి

పొదుపు, మదుపు, సంపాదన.. మంత్రాలు పటించే యువతకు అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌ పరిచయం అక్కర్లేదు. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులతోనే కోట్లకు పడగలెత్తారాయన.

Updated : 19 Nov 2022 00:30 IST

పొదుపు, మదుపు, సంపాదన.. మంత్రాలు పటించే యువతకు అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌ పరిచయం అక్కర్లేదు. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులతోనే కోట్లకు పడగలెత్తారాయన. పలు సందర్భాల్లో ఆయన చెప్పిన విలువైన అనుభవ పాఠాలివి.

* నిజాయతీ అనేది వెలకట్టలేని బహుమానం. దీన్ని చౌకబారు వ్యక్తుల నుంచి ఆశించలేం.
* అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అవి బంగారు వర్షాన్ని కురిపించినప్పుడు చెంబులతో కాదు.. కడవలతో ఒడిసిపట్టాలి.
* ప్రపంచలో గొప్ప విజేతల విజయ రహస్యం ఏంటంటే.. వాళ్లు ఇష్టపడ్డ పనినే చేస్తుంటారు.
* విజయవంతమైన వ్యక్తులు, అత్యంత విజయవంతమైన వాళ్ల మధ్య తేడా ఒక్కటే. అత్యంత విజయవంతమైన వాళ్ల డిక్షనరీలో ‘నో’ అనే పదానికి తావుండదు.
* ప్రపంచంలో అత్యంత గొప్పదైన పెట్టుబడి మనమీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం.
* జీవితాంతం కూడబెట్టుకున్న కీర్తిసౌధాలు కూలిపోవడానికి ఐదు నిమిషాలు చాలు. ఇది గుర్తున్నన్నాళ్లూ తప్పు చేయాలనే ఆలోచనే
నీ ఊహల్లోకి రాదు.
* అసాధారణమైన ఫలితాలు దక్కాలంటే ప్రతి పనినీ అసాధారణంగా చేయాల్సిన పని లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని