ఏదో సరదాకి

కోరుకున్న కాలేజీలో సీటు.. సిటీబస్సులో ప్లేసు.. అందమైన అమ్మాయి మనసులో చోటు దొరకడం కష్టం గురూ!

Published : 26 Nov 2022 01:13 IST

కోరుకున్న కాలేజీలో సీటు.. సిటీబస్సులో ప్లేసు.. అందమైన అమ్మాయి మనసులో చోటు దొరకడం కష్టం గురూ!
   ఏడిస్తే కన్నీళ్లు రాలతాయి.. నవ్వితే పళ్లు రాలవు.. అందుకే ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి.
   భార్య: నేను మీకు నాలుగైదు రోజులు కనిపించకపోతే ఎలా ఉంటుందండీ?
భర్త: చాలా సంతోషంగా. నా అంత లక్కీఫెలో ఉండడనుకో...
తర్వాత అతడికి భార్య నాలుగురోజులు కనిపించలేదు. ఐదోరోజు మసకమసకగా కనిపించింది. కంటివాపు తగ్గాక.
   ఫ్రెండ్‌: నీ బోయ్‌ఫ్రెండ్‌ నీకు బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయాడట కదే...
ఔను.. పారిపోతాడని తెలిసే మొబైల్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు అన్నీ దాచేశా. సాయంత్రానికి తిరిగి వస్తాడులే.

- ఓ.శ్రీనివాసులురెడ్డి, నంద్యాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని