చెమటని పట్టించేలా..

జిమ్‌కో, మైదానానికో వెళ్లి పోజు కొట్టడం కాదు.. కనీసం చెమటలు పట్టేలా కసరత్తులు చేస్తేనే.. దానికి సార్థకత. మరి ‘ఒంటికి ఎంత చెమట పట్టింది?

Updated : 26 Nov 2022 03:18 IST

జిమ్‌కో, మైదానానికో వెళ్లి పోజు కొట్టడం కాదు.. కనీసం చెమటలు పట్టేలా కసరత్తులు చేస్తేనే.. దానికి సార్థకత. మరి ‘ఒంటికి ఎంత చెమట పట్టింది? శరీరంలో ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి? తెలిపే పరికరం ఉంటే బాగుంటుంది కదా’ అంటారా.. లేకేం.. బుల్లి పరికరం AbsolutSweat' Sweat Fitness Tracker అదే పని చేస్తుంది. దీన్ని చర్మంపై స్టిక్కర్‌లా అతికించుకుంటే చాలు.. ఎంత చెమట పట్టింది.. శరీరంలో సోడియం, గ్లూకోజ్‌, పొటాషియం స్థాయిలు ఎంతున్నాయనే వివరాలు మొత్తం చెప్పేస్తుంది. వాటిస్థాయిలు బాగా పడిపోతేే తిరిగి భర్తీ చేయమని హెచ్చరిస్తుంది. వర్కవుట్‌ చేయడానికి ముందు దీన్ని మెడ, ఛాతీ, భుజం.. ఎక్కడైనా అతికించుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానిస్తే వివరాలన్నీ తెరపై చూపిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని