వార్డ్ రోబ్‌లో ఇవి ఉన్నాయా ?

చలి జోరందుకుంది. దానికి చెక్‌ పెట్టేలా ఈ సమయంలో మన వార్డ్‌రోబ్‌లో తప్పకుండా ఉండాల్సినవి.

Published : 26 Nov 2022 01:12 IST

సందర్భం

చలి జోరందుకుంది. దానికి చెక్‌ పెట్టేలా ఈ సమయంలో మన వార్డ్‌రోబ్‌లో తప్పకుండా ఉండాల్సినవి.

స్లిమ్‌ఫిట్‌ జీన్స్‌: ఒంటిని పట్టేసి చలినుంచి రక్షణనిస్తాయి.
స్యూడే బూట్లు: కాళ్లకి వెచ్చదనం ఇవ్వడమే కాదు.. వేసుకున్న డ్రెస్‌కి మరింత హుందాతనం తీసుకొస్తాయి.
లాంగ్‌స్లీవ్‌ పోలో స్వెటర్‌: చేతుల్ని నిండుగా కప్పేసి చలిని కాస్తాయి.
నెక్‌షర్ట్‌ లేదా నెక్‌ స్వెటర్‌: వణుకుని తగ్గించాలంటే ఈ కాలంలో తప్పకుండా ఉండాల్సిన ఔట్‌ఫిట్‌.
బాంబర్‌ జాకెట్‌: స్టైల్‌కి స్టైల్‌, ఒంటికి రక్షణ కావాలనుకునే కుర్రకారు ఛాయిస్‌ ఇది.
చేతి గ్లౌజులు: ద్విచక్రవాహనంపై ప్రయాణించే కుర్రకారు కోసం. చేతులు, వేళ్లకి కవచాల్లా పని చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని