సొగసు పెంచే.. ఎల్‌ఈడీ థెరపీ!

అందం, అమ్మాయిలది విడదీయలేని బంధం. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి రకరకాల సౌందర్యోత్పత్తులు, ఉపకరణాలు, థెరపీలు వస్తూనే ఉంటాయి.

Updated : 10 Dec 2022 00:41 IST

అందం, అమ్మాయిలది విడదీయలేని బంధం. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి రకరకాల సౌందర్యోత్పత్తులు, ఉపకరణాలు, థెరపీలు వస్తూనే ఉంటాయి. వాటిని ఆదరించేవాళ్లు ఆదరిస్తూనే ఉంటారు. అలా ఈ మధ్యకాలంలో బాగా పాపులరైంది ఎల్‌ఈడీ లైట్‌ థెరపీ. దీంతో చర్మంపై ఉండే మచ్చలు, ముడతలు, సొరియాసిస్‌, గాయాలు మటుమాయం అయిపోయి.. అమ్మాయిల అందం రెట్టింపవుతుంది అంటున్నారు చర్మ నిపుణులు. ఈ థెరపీలో ఒక రకమైన ఎల్‌ఈడీ మాస్కులు ఉపయోగిస్తారు. వాటి ద్వారా కిరణాలు పంపి నిర్జీవమైన బ్యాక్టీరియా కణజాలాన్ని తొలగించి చర్మం మెరిసిపోయేలా చేస్తారట. ఇందులో బ్లూ, యెల్లో, రెడ్‌ అనే మూడు రకాల థెరపీలుంటాయి. బాలీవుడ్‌ స్టార్ల నుంచి పట్టణాలు, మెట్రో నగరాల్లోని అమ్మాయిల దాకా ఇప్పుడు అత్యధికులు వీటి బాట పడుతున్నారు. ‘యాభైలో పడినా నా ముఖం ఇలా మెరిసిపోవడానికి ఎల్‌ఈడీ థెరపీనే కారణం’ అని ఈమధ్యే చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ భామ మలైకా అరోరా. ‘యువత ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌కి వెళ్లినట్టుగా భవిష్యత్తులో ఈ ఎల్‌ఈడీ థెరపీల బాట పడతారు’ అంటోంది ముంబయి స్టైలిస్ట్‌ రూపాలీ. అమ్మాయిల కోసం ఇవి అందుబాటులోకి వచ్చినా.. అబ్బాయిలూ ఆసక్తి చూపిస్తున్నారు అంటుందామె.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని