ఎందుకంటే..

అమ్మదొంగా అని ఎందుకంటారు?

Updated : 10 Dec 2022 00:41 IST


* అమ్మదొంగా అని ఎందుకంటారు?

- నాన్న పర్సులోంచి డబ్బులు కొట్టేస్తుందని


* పెళ్లి ఎలాంటిదంటే..

- రెస్టరెంట్‌కి వెళ్లి ఆర్డర్‌ ఇవ్వడం లాంటిది. మనకి నచ్చినవే ఆర్డర్‌ ఇస్తాం. కానీ పక్కవాళ్ల ప్లేట్లలో పదార్థాలు చూడగానే.. అవైతే బాగుండు అనిపిస్తుంది.


* రేడియో జాకీ విస్తుపోయేదెప్పుడు?

- స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘జనగణమన’ గీతాన్ని వినిపించమని కోరినప్పుడు


* ఇంటి యజమాని అవాక్కయ్యేదెప్పుడు?

- ఫ్లాట్‌లోకి అద్దెకు దిగిన బ్యాచిలర్స్‌ పాలకు బదులు బీర్లు పొంగించినప్పుడు


* మనం ఏడిస్తే అమ్మానాన్నలు ఆనందపడేదెప్పుడు?

- మనం పుట్టినప్పుడు...


* టీచరు ఆశ్చర్యపోయేదెప్పుడు?

- ‘నీ చేతిరాత ఏంట్రా అంత దరిద్రంగా ఉంది’ అంటే ‘చేతి రాతదేముంది సార్‌.. తలరాత బాగుండాలిగానీ’ అని విద్యార్థి అన్నప్పుడు


- జి.నర్సయ్య, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని