కొంటె కొటేషన్‌

జలంపై జపమా... జాగ్రత్త మిత్రమా!

Updated : 10 Dec 2022 04:34 IST

* జలంపై జపమా...
   జాగ్రత్త మిత్రమా!

- ప్రతాప్‌కుమార్‌ ఉప్పలపాటి, ఈమెయిల్‌

*చాలించు విన్యాసం...
   మునిగితే.. కైలాసం!

- కవుటూరి శ్రీలత, నెల్లూరు

* తలకిందులుగా తపస్సు...
ఈదగలవా నువ్వు సరస్సు!

- మువ్వల రామారావు, ఉద్దవోలు

* నీళ్లపై ఏంటీ యోగా...
   వేరేచోట దొరకలేదా జాగా!

- అభితేజ్‌రెడ్డి, హైదరాబాద్‌

* బాగుంది శీర్షాసనం...
   కనిపిస్తోందా పైన ఆకసం!

- శిరీష, ఈమెయిల్‌

* నీళ్లలో నువ్వు తలకిందులు...
  చూసేవాళ్లు ఆశ్చర్యచకితులు!

- సయ్యద్‌ బాషా, పాతరాయచోటి

*నీటిపై శీర్షాసనం...
  మునిగితే తప్పదు శవాసనం!

- పేరాల నాగరాజు, హుజూరాబాద్‌


పక్క ఫొటోకి  మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని