చలిలో కసరత్తులు.. జర భద్రం

సహజంగా తెల్లవారుజామునే ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంటారు. యోగా, పరుగులాంటివైతే ఆరుబయటే. ఈ చలిలో కసరత్తులు చేయడం, పరుగెత్తడం ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

Published : 21 Jan 2023 00:21 IST

కాలం ఏదైనా కసరత్తులు చేయడానికి సానుకూలమే. కానీ చలి జోరు మీదున్న ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఫిట్‌నెస్‌ గురూలు.
* సహజంగా తెల్లవారుజామునే ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంటారు. యోగా, పరుగులాంటివైతే ఆరుబయటే. ఈ చలిలో కసరత్తులు చేయడం, పరుగెత్తడం ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. బయటికి వెళ్లాల్సి వస్తే ఒంటికి  చలి నుంచి కాపాడే ఎస్‌పీఎఫ్‌ లోషన్లు రాసుకోవాలి.
* చలి ఎక్కువగా ఉంది కదాని.. మొత్తం ఒంటిని చుట్టేసే దుస్తులు వేసుకొని వ్యాయామం చేస్తానంటే కుదరదు. అవి కసరత్తులకు ప్రతిబంధంగా మారతాయి. వర్కవుట్లు చేస్తున్న కొద్దీ ఉక్కబోయడంతో అసౌకర్యంగా మారతాయి. తేలికైన లేయర్ల ఔట్‌ఫిట్‌లు ఉత్తమం.
* ఒంటికి వెచ్చదనం ఉండాలన్నా.. కసరత్తులు సరిగా జరగాలన్నా.. ఈ కాలంలో ఎక్కువగా కేలరీల ఆహారం తీసుకుంటుండాలి. ఒంట్లోని కేలరీలు కరిగి మంచి శరీరాకృతి సొంతం కావాలంటే ముందు ఒంటికి అందితేనే కదా!
* చలికాలంలో సాధారణంగా చెమట్లు పట్టవు. ఎక్కువగా దాహం వేయదు. దీంతో చాలామంది తక్కువగా నీళ్లు తాగుతుంటారు. కానీ కసరత్తుల మోతాదు ఎక్కువైతే మనకు తెలియకుండానే ఒంట్లోంచి నీరు ఖర్చైపోతుంటుంది. డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండాలంటే.. కొద్దికొద్దిగానైనా నీరు తీసుకుంటుండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని