షాండ్లియర్‌ లోలాకులు

డయానా కాల్డా అనే అమెరికన్‌ డిజైనర్‌ అందరిలాంటి అమ్మాయి కాదు.. సాంకేతిక ప్రయోగాలు చేయడంలో దిట్ట. స్టైల్‌కి టెక్నాలజీని జోడించడం తన స్టైల్‌.

Published : 21 Jan 2023 00:21 IST

కొత్త ఫ్యాషన్‌

డయానా కాల్డా అనే అమెరికన్‌ డిజైనర్‌ అందరిలాంటి అమ్మాయి కాదు.. సాంకేతిక ప్రయోగాలు చేయడంలో దిట్ట. స్టైల్‌కి టెక్నాలజీని జోడించడం తన స్టైల్‌. గతంలో చాలానే ప్రయోగాలు చేసింది. తాజాగా వెలుగులు విరజిమ్మే చెవి రింగుల ఆభరణాలను రూపొందించింది. ఈ నయా ఫ్యాషన్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ చెవి రింగులను అచ్చమైన బంగారం, వెండి, గ్లాస్‌ క్రిస్టల్స్‌లతోనే మలిచింది. కాకపోతే వీటిలో వెలుగులు విరజిమ్మే సూక్ష్మమైన షాండ్లియర్లు అమర్చింది. ఇవి ఎల్‌ఈడీ లైట్లలా వెలుగుతూనే ఉంటాయి. కావాలనుకుంటే ఆర్పేయొచ్చు. అందులో అమర్చిన మైక్రో బ్యాటరీలతో ఇవి పని చేస్తాయట. ఏదేమైనా ఈ అమెరికా చిన్నది చేసిన ప్రయోగానికి అమ్మాయిలంతా ఫిదా అవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని