సులువైన మౌస్‌ ఇది

కంప్యూటర్‌ లేకుండా కుర్రకారుకి రోజు గడవని కాలమిది. పీసీపై ఎంత ఎక్కువసేపు పని చేస్తే మౌస్‌ని అంతగా వాడాల్సిందే. అయితే ఇలా పని ఎక్కువైనకొద్దీ కొందరికి మణికట్టు, చేతివేళ్లలో భరించరాని నొప్పి ఉంటుంది

Published : 28 Jan 2023 00:23 IST

కంప్యూటర్‌ లేకుండా కుర్రకారుకి రోజు గడవని కాలమిది. పీసీపై ఎంత ఎక్కువసేపు పని చేస్తే మౌస్‌ని అంతగా వాడాల్సిందే. అయితే ఇలా పని ఎక్కువైనకొద్దీ కొందరికి మణికట్టు, చేతివేళ్లలో భరించరాని నొప్పి ఉంటుంది. దీన్నే రిపెటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యూరీస్‌ (ఆర్‌ఎస్‌ఐ) అంటుంటారు. ఈ గాయాలు, నొప్పి రాకుండా మ్యాటియో ఎర్కోల్‌ అనే కంపెనీ బటన్‌ లేని మౌస్‌ని రూపొందించింది. టచ్‌ సెన్సిటివ్‌ టెక్నాలజీ ఆధారంగా ఇది పని చేస్తుంది. ఇది వాడుతుంటే చేతులు, వేళ్లకి అలసటే తెలియదు. స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌తోనే ఛార్జింగ్‌ చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని