నా ప్రాణమే నీదనుకొని..

నీకు తాజ్‌మహల్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేద్దాం అనుకున్నా...కానీ షాజహాన్‌లా చక్రవర్తిని కాను!

Published : 11 Feb 2023 00:16 IST

నీకు తాజ్‌మహల్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేద్దాం అనుకున్నా...
కానీ షాజహాన్‌లా చక్రవర్తిని కాను!
రాముడిలా విల్లు విరిచి గట్టిగా చెబుదామనుకున్నా...
ఆ అవతారపురుషుడిలా నేను బలశాలిని కాదు!
కాళిదాసులా కవిత రాసి ఇద్దాం అనుకున్నా...
నీ అందానికి సరితూగే అక్షరం ఇంక పుట్టలేదని ఆగిపోయా!
నిన్ను చేరని నా ప్రేమే వ్యర్థమనుకొని తనువు చాలిద్దామనుకున్నా...
కానీ నా ప్రాణమే నీదని తెలుసుకున్నా...
ఆ విషయమే చెబుతూ నీకు ప్రపోజ్‌ చేస్తున్నా!    

జగన్‌ త్రివిక్రమ్‌, శృంగవరపుకోట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని