ఆగితే.. సాగదు

త్తుపల్లాలు, కష్టసుఖాలతో.. ఓ రోలర్‌కోస్టర్‌లా ఉన్నప్పుడే జీవితంలో ఉత్సుకత, సంతోషం ఉంటాయి. లేకపోతే చప్పగా సాగిపోతుంది.

Published : 18 Feb 2023 00:18 IST

* ఎత్తుపల్లాలు, కష్టసుఖాలతో.. ఓ రోలర్‌కోస్టర్‌లా ఉన్నప్పుడే జీవితంలో ఉత్సుకత, సంతోషం ఉంటాయి. లేకపోతే చప్పగా సాగిపోతుంది.
* అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించి నా శక్తి వృథా చేసుకోను. ప్రతి క్షణాన్ని నేను ఎంచుకున్న రంగం కోసమే వెచ్చిస్తా. రోజుకో మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తా.
* తెలిసో, తెలియకో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తుంటారు. నేనూ మినహాయింపేం కాదు. వాటినే తలచుకొని బాధ పడితే ప్రయోజనం ఉండదు. వాటిని పాఠాలుగా మలచుకోకపోతే భవిష్యత్తు ఉండదు.
* నిర్జీవమైన సముద్ర అలలే ఎగసెగిసి పడుతుంటే.. ప్రాణం ఉన్న మనిషికి ఎంత ఉండాలి? తలచుకుంటే నీ సత్తా ఇంతే అన్నవాళ్లు సైతం తలవంచుకునేలా ఎదిగి చూపించాలి.
* సృష్టిలో చలన గుణం ఉన్నదేదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెటు.. ఆఖరికి అనుకున్నది సాధించాలని కసికసిగా నీలో ప్రవహించే నెత్తురు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని