బాధకూ.. నవ్వు ఎమోజీలే!

మనసు సంతోషంగా ఉంటే నవ్వుతాం. బాధ అనిపిస్తే ఏడుస్తాం. ఎమోజీల వాడకమూ అంతే. మన మూడ్‌ని బట్టి సెల్‌ఫోన్‌లో.. ఆన్‌లైన్‌లో.. చాటింగ్‌లో.. సామాజిక మాధ్యమాల్లో.. ఎడాపెడా వాడేస్తుంటుంది నేటి జనరేషన్‌ జడ్‌

Published : 08 Apr 2023 00:12 IST

మనసు సంతోషంగా ఉంటే నవ్వుతాం. బాధ అనిపిస్తే ఏడుస్తాం. ఎమోజీల వాడకమూ అంతే. మన మూడ్‌ని బట్టి సెల్‌ఫోన్‌లో.. ఆన్‌లైన్‌లో.. చాటింగ్‌లో.. సామాజిక మాధ్యమాల్లో.. ఎడాపెడా వాడేస్తుంటుంది నేటి జనరేషన్‌ జడ్‌. ఇందులో కొత్త విషయం ఏంటంటే.. యువత తమలోని ప్రతికూల భావోద్వేగాలకు సైతం ఆల్‌ ఈజ్‌ వెల్‌ అన్నట్టుగా పాజిటివ్‌ ఎమోజీలను వాడుతున్నారట. యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం తేలింది. దీనికోసం వాళ్లు 16 నుంచి 29 ఏళ్ల వయస్కుల అభిప్రాయాలు సేకరించారు. అధ్యయన వివరాల్ని ఫ్రంటియర్స్‌ ఇన్‌ సైకాలజీలో ప్రచురించారు. బాధలు, ఇబ్బందుల్లో ఉన్నా.. తమని తాము సర్దిచెప్పుకోవడానికి, పరిస్థితి బాగు పడుతుందనే ఆశావహ దృక్పథంతోనే సామాజిక మాధ్యమాల్లో, స్నేహితులతో చాటింగ్‌లో, ఇలా ప్రతీచోటా యువత పాజిటివ్‌ ఎమోజీలనే వాడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. కానీ ఇలా చేయడం తమను తాము మోసం చేసుకోవడం, బలహీన మనస్తత్వానికి సంకేతం అన్నది మానసిక నిపుణుల వాదన. ఎవరేం చెప్పినా అంతా సానుకూలం అని భావించడం శుభపరిణామమే కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని