జీతం ఎక్కువైనా నో సంతోషం

క్యాంపస్‌లో ఉండగానే కొలువు కొట్టిన అమ్మాయైనా, పలు దఫాలుగా దండయాత్రలు చేసి ఉద్యోగం సంపాదించిన యువకుడైనా.. ముందు ఆరా తీసేది ప్యాకేజీ గురించే. ఎవరైనా జీతం ఎక్కువైతేనే కెరియర్‌లో ఖుషీ అనుకుంటారు.

Published : 15 Apr 2023 00:02 IST

అధ్యయనం

క్యాంపస్‌లో ఉండగానే కొలువు కొట్టిన అమ్మాయైనా, పలు దఫాలుగా దండయాత్రలు చేసి ఉద్యోగం సంపాదించిన యువకుడైనా.. ముందు ఆరా తీసేది ప్యాకేజీ గురించే. ఎవరైనా జీతం ఎక్కువైతేనే కెరియర్‌లో ఖుషీ అనుకుంటారు. కానీ కుర్రాళ్లూ.. మీరు జాబ్‌లో చేరే ముందే దానివల్ల కలిగే సంతోషం గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే.. ఆరంకెల జీతం, పెద్దపెద్ద హోదాలో ఉన్నవాళ్లు కూడా మా కెరియర్‌లో ఫన్‌ లేదు.. జీవితంలో ఆనందం లేదు.. అని తెగ బాధ పడిపోతున్నారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైందీ వాస్తవం. ముఖ్యంగా ఒక ఉద్యోగికి మరో ఉద్యోగితో కలిసి పని చేసే అవకాశం లేని పైస్థాయికి చెందిన ఉద్యోగుల నుంచి రాత్రి షిఫ్ట్‌లు చేసేవాళ్లు, ట్రక్‌ డ్రైవర్లు, సెక్యూరిటీ ఉద్యోగులు, ఫుడ్‌ డెలివరీ అసోసియేట్లు, ఆన్‌లైన్‌ ఎంప్లాయీస్‌.. తాము చేస్తున్న ఉద్యోగాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అందుకే మరి జాబ్‌లో చేరేముందే.. దాని స్వభావం, మన మనస్తత్వానికి సరిపోతుందా, లేదా అని నాలుగుసార్లు ఆలోచించి ఎంచుకోవాలంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు