అరే యార్‌.. నీళ్లు తాగు

అసలే ఎండాకాలం కదా.. మనం ఎక్కడికెళ్లినా వెంట ఓ వాటర్‌ బాటిల్‌ కూడా తీసుకెళ్తుంటాం. జాగింగ్‌, జిమ్‌కి అయినా సరే.

Published : 22 Apr 2023 00:28 IST

సలే ఎండాకాలం కదా.. మనం ఎక్కడికెళ్లినా వెంట ఓ వాటర్‌ బాటిల్‌ కూడా తీసుకెళ్తుంటాం. జాగింగ్‌, జిమ్‌కి అయినా సరే. ఈసారి మామూలు బాటిల్‌కి బదులు ‘పీయూఎల్‌ స్మార్ట్‌క్యాప్‌’ ప్రయత్నించండి. దీని ప్రత్యేకత ఏంటంటే.. మనం ఆ రోజు ఎన్ని ద్రవాలు తీసుకున్నాం.. ఇంకా ఎంత తీసుకోవాల్సి ఉంటుంది? డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం తాగే నీళ్లలో బ్యాక్టీరియా ఎంత ఉంది? ఈ లెక్కలన్నీ చెప్పేస్తుంది. ఎక్కువ సమయం శరీరంలోకి ఎలాంటి ద్రవాలు వెళ్లకపోతే.. సెల్‌ఫోన్‌కి సందేశాలు పంపుతూ గుర్తు చేస్తుంది కూడా. ఇదెలా సాధ్యం అంటే.. ఈ బాటిల్‌ స్టెయిన్‌లెస్‌స్టీల్‌తో తయారైనా.. మూత మాత్రం ప్లాస్టిక్‌తో రూపొందించారు. అందులోనే ఒక చిప్‌ని అమర్చుతారు. దాన్ని ఫోన్‌ యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. సెన్సర్‌ ఫ్లో టెక్నాలజీ ద్వారా ద్రవాలను విశ్లేషించి సమాచారం చేరవేస్తుంది. అయితే మనం ఎలాంటి పానీయం తీసుకున్నా.. ఆ బాటిల్‌లోనే నింపుకొని తాగాలనేది నియమం. HYDURO INC  కంపెనీ తయారీదారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని