కొంటె కొటేషన్‌

నీ అందం బార్బీ బొమ్మ...   తల వంచింది పూల కొమ్మ! గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

Published : 20 May 2023 01:11 IST

* నీ అందం బార్బీ బొమ్మ...
   తల వంచింది పూల కొమ్మ!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు
* పూల మాటున పడతి...
   చూపరులకు వింత సంగతి!

రామారావు మువ్వల, ఉద్దవోలు
* నెలవంకని మరిపించే నృత్యం భామది...
   తన కోసం వికసించే తపన పూలకొమ్మది!
అరవింద్‌ ఆర్‌., పెంట్లవెల్లి
* చిటారు కొమ్మన పుష్పం...పడతికి ఇప్పుడది వస్త్రం!
కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌
* అందాల పూబోణీ...అదిరింది నీ గారడీ!
 ఇసికేల ఉదయకుమార్‌, హైదరాబాద్‌
* కలువల సుందరాంగీ...అతివల్లో నీవు లలితాంగి!
దంటు వరప్రసాద్‌, ఉన్నవ
* బాగుందమ్మా బార్బీ బొమ్మ...కలువ నీకు కోకగా మారిందమ్మా!
కలివరపు రామకృష్ణ, దూసి
* మా ఇల్లే కలువ పందిరి...నేనేలే సువర్ణ సుందరి!
 తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం
* కలువ వెనక బ్యూటీ...తన అందానికి రారెవరూ సాటి!
వసీం, ఆదిలాబాద్‌

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని