రోజూ పితృదినోత్సవమే..

తన జీవిత అనుభవాలను.. ఆసక్తికర సంఘటనలను యువతకు స్ఫూర్తి కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు వేదాంతా రిసోర్సెస్‌ అధినేత అనిల్‌ అగర్వాల్‌.

Published : 17 Jun 2023 00:02 IST

తన జీవిత అనుభవాలను.. ఆసక్తికర సంఘటనలను యువతకు స్ఫూర్తి కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు వేదాంతా రిసోర్సెస్‌ అధినేత అనిల్‌ అగర్వాల్‌. ఫాదర్స్‌ డే సందర్భంగా ఆయన తన తండ్రితో అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు.

‘ఓసారి మేం ఇల్లు శుభ్రం చేస్తుండగా పాత కాలం నాటి ఫొటోలున్న ఒక బాక్స్‌ కనపడింది. అందులో నాకెంతో ప్రీతిపాత్రుడైన మా ‘బాబూ జీ’ ఉన్నారు. నీలం రంగు కోటు, ధోవతీ ధరించి ఆయన ఎంతో అందంగా ఉన్నారు. ఆ ఫొటోలు చూస్తుంటే పాతకాలం నాటి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఆయన రోజూ పని నుంచి ఇంటికొచ్చేటప్పుడు, ఎంత రాత్రైనా సరే.. స్వీట్లు లేదా నాకెంతో ఇష్టమైన దానిమ్మ గింజలు తెచ్చేవారు. ఎంత తీరిక లేని పనిలో ఉన్నా.. ఆయన నా గురించి ఆలోచిస్తున్నారని చెప్పడానికి అదో సంకేతం. మనకిష్టమైన వ్యక్తులు మనతో ఉండవచ్చు.. లేకపోవచ్చు. కానీ వాళ్లు మనకి వదిలి వెళ్లిన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ పదిలంగానే ఉంటాయి. కొన్ని బాక్సుల రూపంలో.. మరికొన్ని జ్ఞాపకాలుగా హృదయాల్లో. వాళ్లు గుర్తుకొస్తే రోజూ ఫాదర్స్‌ డేనే’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని