కొంటె కొటేషన్‌

ఫ్రాన్స్‌కి అది ఆభరణం... కావొద్దు నీకు ఆహారం! ఎత్తగలవా ఈఫిల్‌ టవర్‌... నీకు ఉందా ఆ పవర్‌!...

Published : 24 Jun 2023 00:15 IST

* ఫ్రాన్స్‌కి అది ఆభరణం... కావొద్దు నీకు ఆహారం!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

* ఎత్తగలవా ఈఫిల్‌ టవర్‌... నీకు ఉందా ఆ పవర్‌!

ఇ.ఉదయకుమార్‌, రాయదుర్గం

* ఈఫిల్‌ టవర్‌కే ముద్దు... అతివ పవర్‌కేదీ హద్దు?

ఎన్‌.వి.కనకమూర్తి, విశాఖపట్నం

* పాపా అది ఈఫిల్‌ టవర్‌... కాదది యాపిల్‌ టవర్‌!

చుక్కల రాము, ఈమెయిల్‌

* భామ నోట్లో ఈఫిల్‌ టవర్‌... క్రెడిట్‌ గోస్‌ టు ఫొటోగ్రాఫర్‌!

పంగెర రమ్య, ధర్పల్లి

* కాదమ్మా అది చాక్లెట్‌... మింగేయాలని చూస్తే తంతావు బకెట్‌!

సాధన తేరాల, ఈమెయిల్‌

* తెలుసా అది ఈఫిల్‌ టవరు... నీకెందుకంత ఆత్రం సిస్టరు!

భరత్‌ శర్మ, భీమవరం

* ఎవరి మీద నీ ఫైరు... ఈసారికి వదిలెయ్‌ అది ఈఫిల్‌ టవరు!

నాని కరె, ఈమెయిల్‌

* లేడీ నోట్లో ఈఫిల్‌ టవర్‌... ఇదేగా ఫొటోగ్రఫీ పవర్‌!

సుధా త్రిలోక్‌నాథ్‌ రెడ్డి, ఈమెయిల్‌

* ఒహో అతివా... ఆరగించకు అతిగా!

ఎం.కె.రమేశ్‌, ఈమెయిల్‌

* అది చెరకుగడ కాదే చెల్లీ... వరల్డ్‌ ఫేమస్‌ ఈఫిల్‌ టవరే తల్లీ!

నివాస్‌ ఓట్ర, తిరుపతి

* ఆకాశంలో నేను సగం... ఈఫిల్‌ టవర్‌నే మింగేస్తా అమాంతం!

పాలూరి అనూష, ఇసుకపూడి

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని