ఏఐతో.. స్మార్ట్‌వాచీ

ఫిట్‌నెస్‌పై మోజో, సొగసుగా కనిపించాలనే తపనో.. యువతలో స్మార్ట్‌వాచీల వాడకం పెరిగిపోతోంది. వాళ్లకి నచ్చేలా సరికొత్త ఫీచర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి కంపెనీలు.

Published : 24 Jun 2023 00:16 IST

ఫిట్‌నెస్‌పై మోజో, సొగసుగా కనిపించాలనే తపనో.. యువతలో స్మార్ట్‌వాచీల వాడకం పెరిగిపోతోంది. వాళ్లకి నచ్చేలా సరికొత్త ఫీచర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి కంపెనీలు. అలాంటిదే అమేజ్‌ఫిట్‌ కంపెనీ తయారు చేసిన ‘చీతా’. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కృత్రిమ మేధతో పని చేస్తుంది. నడవాల్సిన దూరం, చేయాల్సిన టాస్కులు ఒక్కసారి సెట్‌ చేస్తే చాలు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. చాట్‌ జీపీటీలా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. మాక్స్‌ట్రాక్‌ అనే జీపీఎస్‌ అత్యంత కచ్చితత్వంతో పని చేస్తుంది. ఇందులో రెండు మోడళ్లున్నాయి. ధర రూ.24 వేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని