అనుభవించు రాజా..

వయసు పెరిగినకొద్దీ వచ్చే తిప్పలు సరదాగా..పొట్ట ముందుకు వస్తానంటుంది జుట్టు రాలిపోతూ ఉంటుంది బరువు పెరిగిపోతానంటుంది

Published : 01 Jul 2023 00:28 IST

వయసు పెరిగినకొద్దీ వచ్చే తిప్పలు సరదాగా..
పొట్ట ముందుకు వస్తానంటుంది
జుట్టు రాలిపోతూ ఉంటుంది
బరువు పెరిగిపోతానంటుంది
కష్టం కమ్మేస్తానంటుంది
అదృష్టం అందనంటుంది
దురదృష్టం వెంటాడతానంటుంది
ఆదాయం స్థిరంగా ఉండనంటుంది
ఖర్చు పరుగు పెడతానంటుంది...
ఆత్మ సంతృప్తి పడనంటుంది
సంతోషం దూరం కానంటుంది
దుఃఖం దూరంగా ఉండనంటుంది
ఆశ మాత్రం బతికిస్తూనే ఉంటుంది

అందుకే  ప్రతిక్షణం జీవితాన్ని ఆస్వాదిస్తామంటోంది ఈతరం.
జముళ్లమూడి ఆల్‌ఫ్రెడ్‌, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని