సెల్‌ఫోన్‌..అక్కడొద్దు!

నోర్డ్‌వీపీఎన్‌ అనే సంస్థ అధ్యయనం ప్రకారం పదిమందిలో ఆరుగురు సెల్‌ఫోన్‌ని వాష్‌రూమ్‌కి సైతం తీసుకెళ్తున్నారట. అందులో అత్యధికులు యువతే. చాటింగ్‌కో.. వీడియోలు చూడటానికో.. పత్రికలు చదవడానికో.. వాళ్లు ఆ పని చేస్తున్నారు

Published : 01 Jul 2023 00:31 IST

నోర్డ్‌వీపీఎన్‌ అనే సంస్థ అధ్యయనం ప్రకారం పదిమందిలో ఆరుగురు సెల్‌ఫోన్‌ని వాష్‌రూమ్‌కి సైతం తీసుకెళ్తున్నారట. అందులో అత్యధికులు యువతే. చాటింగ్‌కో.. వీడియోలు చూడటానికో.. పత్రికలు చదవడానికో.. వాళ్లు ఆ పని చేస్తున్నారు. అయితే వాష్‌రూం, టాయ్‌లెట్‌లు బ్యాక్టీరియా, ఇతర వ్యాధికారకాలకు నిలయం అనే సంగతి తెలిసిందే. మిగతా ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ 18 రెట్లు అత్యధికంగా బ్యాక్టీరియా పోగుపడి ఉంటుందంటున్నారు. వాష్‌రూంలో సెల్‌ఫోన్‌ని వాడినప్పుడు సూక్ష్మక్రిములు ఫోన్‌ ఉపరితలంపైకి చేరతాయి. తెరపై 28రోజులపాటు ఉంటాయి. నోరు, ముక్కు, చెవులు, కళ్ల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటి కారణంగా కడుపు నొప్పి, డయేరియా, ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోస ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ఫోన్‌తో లోపలికి వెళ్లేటప్పుడు.. ఓసారి ఆలోచించండి యూత్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని