ఓసారి ఏమైందంటే..

బీటెక్‌ ఫైనలియర్‌లో ఉండగా జరిగిందిది. ఒక చలాన్‌ కట్టడం కోసం డీడీ తీయడానికి బ్యాంకుకి వెళ్లాను. లోపల అడుగు పెట్టగానే కౌంటర్‌లో ఒక అందమైన అమ్మాయి కనిపించింది.

Published : 22 Jul 2023 00:49 IST

బీటెక్‌ ఫైనలియర్‌లో ఉండగా జరిగిందిది. ఒక చలాన్‌ కట్టడం కోసం డీడీ తీయడానికి బ్యాంకుకి వెళ్లాను. లోపల అడుగు పెట్టగానే కౌంటర్‌లో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. డీడీ ఎలా తీయాలో నాకు తెలియదు. సరాసరి వెళ్లి ఆమెనే అడిగా. వివరంగానే చెప్పింది. నేనేమో తననే చూస్తూ ఉండటంతో విన్నది సరిగా అర్థం కాలేదు. నా క్వశ్చన్‌మార్క్‌ మొహం చూసి.. ‘మీ నెంబర్‌ చెప్పండి’ అంది. నాకు ఆశ్చర్యంతోపాటు చెప్పలేనంత సంతోషం కలిగింది. గబగబా నా ఫోన్‌ నెంబర్‌ చెప్పి ‘మరి మీదో’ అన్నాను. ఆమె ఒక్కసారి నావైపు కోపంగా చూసి ‘అక్కౌంట్‌ నెంబర్‌ సార్‌. నేనడిగింది.. మీ అకౌంట్‌ నెంబర్‌’ అంది. అక్కడున్నవాళ్లంతా ఒకటే నవ్వు. నేను పని పూర్తయ్యేదాకా తల ఎత్తితే ఒట్టు. తర్వాత మళ్లీ ఆ బ్యాంకుకి వెళ్లలేదు.

ఎస్‌.ఉదయ్‌, సికింద్రాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని