వాన జోరు..కావొద్దు బేజారు

చేతికి బండి అందిందా.. మేఘాల్లోనే తేలిపోతుంటుంది యువత. ఈ వేగం అన్నివేళలా పనికి రాదు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Updated : 29 Jul 2023 02:17 IST

చేతికి బండి అందిందా.. మేఘాల్లోనే తేలిపోతుంటుంది యువత. ఈ వేగం అన్నివేళలా పనికి రాదు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

* ముఖాన్ని కప్పేసే ఫుల్‌ హెల్మెట్‌, చేతికి గ్లౌజులు, వాటర్‌ప్రూఫ్‌ బూట్లు, రెయిన్‌కోటు.. క్రమం తప్పకుండా ప్రయాణించే రైడర్లు ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిన వస్తువులు.
* ఎక్కడ ఏ గతుకు ఉందో, ఏ నీటి మడుగు కింద మ్యాన్‌హోల్‌ ఉందో ఎవరికీ తెలియదు. ముందు వాహనాలకు సాధ్యమైనంత దూరం పాటిస్తుంటే.. ఓ అంచనాకు రావొచ్చు. నీరు నిలబడని చోటి నుంచి వెళ్లడమే ఉత్తమం.
* వర్షం పడుతున్నప్పుడు, వాతావరణం సరిగా లేనప్పుడు రోడ్డు సరిగా కనపడదు. హెల్మెట్‌ విజర్‌కి కార్‌ వ్యాక్స్‌ వాడితే నీరు వెళ్లిపోయి సాఫీగా ఉంటుంది. హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, టెయిల్‌లైట్లు తప్పకుండా వాడితే.. మనతోపాటు వెనక, ముందు ఉన్నవారికి రోడ్లు స్పష్టంగా కనిపిస్తాయి.
* సడెన్‌ బ్రేక్‌లు వేయడం, ఒక్కసారిగా యాక్సిలేటర్‌ పెంచడం.. క్షణాల్లో లేన్‌లు మార్చడం ఇలాంటి సాహసాలు పనికిరావు. ఈ సీజన్‌లో హైడ్రోప్లేనింగ్‌ కారణంగా వాహనాలు జారిపోతూ ప్రమాదాలకు గురవుతుంటాయి. హైవేలు, నీరు నిల్వ ఉన్నచోట్ల వేగం ఎంత తగ్గిస్తే అంత మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని