బయటికెళ్లకుండానే..భలేగా వ్యాయామం!

ఈ కాలంలో ముసురు పడితే.. ఒంటికి పని చెప్పాలనిపించదు. వర్షం పడుతుంటే.. అసలు బయటికెళ్లే అవకాశమే ఉండదు. ఇలాగైతే మనం ఫిట్‌నెస్‌ గోల్‌ చేరేదెలా? అలాంటప్పుడే కుర్రకారు ఇంటినే జిమ్‌గా మార్చేయాలి

Updated : 12 Aug 2023 01:14 IST

ఈ కాలంలో ముసురు పడితే.. ఒంటికి పని చెప్పాలనిపించదు. వర్షం పడుతుంటే.. అసలు బయటికెళ్లే అవకాశమే ఉండదు. ఇలాగైతే మనం ఫిట్‌నెస్‌ గోల్‌ చేరేదెలా? అలాంటప్పుడే కుర్రకారు ఇంటినే జిమ్‌గా మార్చేయాలి. ఇదిగో ఇలా..

  • నడక.. తేలికైన మంచి వ్యాయామం. టీవీ చూస్తూ, సంగీతం వింటూ, ఫోన్‌ మాట్లాడుతూ.. ప్రతి పని చేస్తూ నడుస్తూనే ఉంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనే కోరిక నెరవేరుతుంది.
  • మీలో ఓపిక, ఉత్సాహం ఎక్కువైతే.. ఇష్టమైన పాటలకు స్టెప్పులేయండి. స్కిప్పింగ్‌, జంపింగ్‌ జాక్స్‌, జుంబా.. ఇలాంటివీ ఫిట్‌నెస్‌ని పెంచే వ్యాపకాలే.
  • ఇంట్లో స్థలం సరిపోదు అనుకునేవాళ్లు అపార్ట్‌మెంట్‌లో ఖాళీ స్థలం, మెట్లు, షాపింగ్‌ మాల్స్‌, పార్కింగ్‌ స్థలం, కమ్యూనిటీ హాల్‌.. వీటన్నింటినీ కసరత్తుల కార్యక్షేత్రాలుగా మలచుకోవచ్చు.
  • బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌.. ఇలాంటి ఇండోర్‌ గేమ్స్‌ సైతం మీ ఫిట్‌నెస్‌ వ్రతాన్ని కొనసాగించే కొన్ని ఆటలు.
  • ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం... నామోషీగా భావించొద్దు. ఈ పనులు ఒంట్లోని కేలరీలను భారీగా కరిగిస్తాయి. పనులు పూర్తవడంతోపాటు.. ఫిట్‌నెస్‌ ప్రయోజనమూ చేకూరుతుంది.                          


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని