హ్హహ్హ.. అలాగా

Published : 19 Aug 2023 00:54 IST

* మంచి మొగుడు దొరకాలని శ్రావణ మాసంలో అమ్మాయిలు గుడికి వెళ్తారు. మరి పెళ్లైన కుర్రాళ్లు ఎందుకు వెళ్తారు? ‘దేవుడా.. నేను ఏమి అడిగాను.. నువ్వు ఏమి ఇచ్చావు’ అని అడగడానికి.

 * మగాడు ఇంటికెళ్లగానే తల్లి కడుపు చూస్తుంది. భార్య జేబు చూస్తుంది. కానీ ఈకాలం అత్తాకోడళ్లు ఏమీ పట్టించుకోకుండా ఇద్దరూ కలిసి టీవీ సీరియల్‌ చూస్తున్నారు.

* మగాళ్లు ఎంత అర్జెంట్‌ పనిలో ఉన్నా సరే.. రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే తల తిప్పి చూస్తారు. అదే మానవత్వం అంటే..

* సిగరెట్‌ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి. కల్తీ నీళ్లు తాగితే కిడ్నీలు పాడవుతాయి. ప్రేమలో విఫలమైతే హృదయం పాడవుతుంది. చదువుకోవడం వల్ల మెదడు పాడవుతుందనేది ఓ విద్యార్థి బాధ.

* భార్య: మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ మీకు చూడటానికి అప్సరసలు ఉంటారట. మరి మాకెవరు ఉంటారు?

    భర్త: కోతులు

భార్య: ఇదన్యాయం. మీకు రెండు చోట్లా అప్సరసలు దొరుకుతారు. మాకు అక్కడా, ఇక్కడా కోతులేనా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని