ధైర్యం.. సరిపోలేదుగా

డిగ్రీలో ఉండగా జరిగిందీ సంఘటన. ఓసారి మా హాస్టల్‌మేట్స్‌ మధ్య ఎవరికెంత ధైర్యం అనే చర్చ నడుస్తోంది. ‘నేను ఫుల్‌ డేరింగ్‌’ అన్నాడొకడు.  ‘అయితే ఈరోజు అర్ధరాత్రి నా ల్యాప్‌టాప్‌లో అందరం ఒక హారర్‌ సినిమా చూద్దాం.

Published : 09 Sep 2023 00:57 IST

క్లాస్‌రూం కహానీలు

డిగ్రీలో ఉండగా జరిగిందీ సంఘటన. ఓసారి మా హాస్టల్‌మేట్స్‌ మధ్య ఎవరికెంత ధైర్యం అనే చర్చ నడుస్తోంది. ‘నేను ఫుల్‌ డేరింగ్‌’ అన్నాడొకడు.  ‘అయితే ఈరోజు అర్ధరాత్రి నా ల్యాప్‌టాప్‌లో అందరం ఒక హారర్‌ సినిమా చూద్దాం. నువ్వు భయపడకపోతే ధైర్యవంతుడివి అని ఒప్పుకుంటా’ అన్నాన్నేను. రాత్రి పన్నెండింటికి మేం నలుగురం ‘ది ఎగ్జార్సిస్ట్‌’ అనే చిత్రం ప్రారంభించాం. అందరిలో కొంచెం భయం ఉన్నా.. మొహంలో కనపడకుండా కవర్‌ చేసుకుంటున్నాం. సినిమా దాదాపు సగంలో ఉండగా.. మాలో ఒకడు సడెన్‌గా భయంభయంగా అరుస్తూ గదిలో అటూ ఇటూ పరుగెత్తసాగాడు. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న మేం కూడా ఒక్కసారిగా వణికిపోయాం. ల్యాప్‌టాప్‌ ఆఫ్‌ చేశాం. కాసేపయ్యాక ‘ఆ సీన్‌ మరీ భయంకరంగా ఏమీ లేదు కదరా.. ఎందుకంత భయపడ్డావ్‌’ అన్నాను. వాడు ‘నా చొక్కాలోకి బొద్దింక దూరింది. బొద్దింకలంటే నాకు చచ్చేంత భయంరా’ అనడంతో ఒక్కసారిగా అందరం ఆగకుండా నవ్వుతూనే ఉన్నాం.

ఎస్‌.రవి, నల్గొండ

(మీకూ ఇలాంటి సరదా అనుభవాలు ఉంటే రాసి పంపండి. ప్రచురిస్తాం.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని