సీరియల్‌ ప్రేమికుడి సీరియస్‌ ప్రేమ

ఆరోజు నాగపంచమి. దేవుడికి పూజలు చేయాలని మధురానగరి వెళితే.. దీపం వెలిగిస్తూ.. నా కళ్లకి ప్రేమ దేవతలా ఆ సుందరి ప్రత్యక్షమైంది. అప్పుడే నా జీవిత కథలో రాజకుమారి తనే అనిపించింది.

Published : 09 Sep 2023 00:57 IST

రోజు నాగపంచమి. దేవుడికి పూజలు చేయాలని మధురానగరి వెళితే.. దీపం వెలిగిస్తూ.. నా కళ్లకి ప్రేమ దేవతలా ఆ సుందరి ప్రత్యక్షమైంది. అప్పుడే నా జీవిత కథలో రాజకుమారి తనే అనిపించింది. ఆ క్షణం నుంచి నువ్వు నేను ప్రేమ అంటూ తన ప్రదక్షిణలే చేయసాగా. కొన్నాళ్లయ్యాక నీ మనసు ఇచ్చి చూడు అని ప్రాథేయపడ్డా. నా కలలు ఫలించి.. తన గుప్పెడంత మనసు కరిగి, తన ఎద లోయలో ఇంద్రధనసులా నాకు చోటు ఇచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ సుందరాంగికి అగ్నిసాక్షిగా, మూడుముళ్లతో బ్రహ్మముడి వేయాలనుకున్నా. గృహలక్ష్మిగా నా సొంతం చేసుకోవాలని భావించా. ఈ విషయం కాబోయే మామగారికి చెబితే.. నీలాంటివాడిని మా జానకి కలగనలేదు.. నీ జిన్‌ మాయాజాలంతో నా కూతుర్ని మెప్పించొచ్చుగానీ నన్ను ఒప్పించలేవు అని తెగేసి చెప్పాడు. దీంతో ప్రియురాలు మౌనరాగం ఎత్తుకుంది. మన పవిత్ర బంధం ఇంతటితో ముగింపు పలుకుదాం అంది. పల్లకిలో పెళ్ళికూతురులా మారి వేరే కుర్రాడిని వివాహం చేసుకుంది. ఆమెను మర్చిపోలేక కృష్ణ ముకుంద మురారీ అని పాడుకుంటూ నేను సన్యాసిలా మారిపోయాను.  

ఎస్‌. శివవరప్రసాద్‌, యాదాద్రి భువనగిరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని