బైక్‌ ఎక్కడున్నా పట్టేస్తుంది

సినిమా థియేటర్‌లో బండిని వరుసలో ఎక్కడో పార్క్‌ చేసి చాలాసార్లు మర్చిపోతుంటాం.

Published : 07 Oct 2023 00:37 IST

సినిమా థియేటర్‌లో బండిని వరుసలో ఎక్కడో పార్క్‌ చేసి చాలాసార్లు మర్చిపోతుంటాం. దానికి ఏదైనా చిన్న ట్రాకింగ్‌ డివైజ్‌ ఉంటే, ఆ పరికరాన్ని మన స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకుంటే.. ఈ వెతుకులాట బాధలుండవు కదా! ఇలాంటివి విపణిలో చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటికీ మించిన ఫీచర్లతో ‘గెలాక్సీ స్మార్ట్‌ ట్యాగ్‌ 2’ని తీసుకొచ్చామంటోంది శామ్‌సంగ్‌ కంపెనీ. ఇది ఒక ట్రాకర్‌లా పని చేస్తుంది. బైక్‌లు, కార్లు, సైకిళ్లు, కీచైన్లు, విలువైన వస్తువులు, పెంపుడు జంతువులు వేటికి అయినా తగిలించుకోవచ్చు. అల్ట్రా వైడ్‌బ్యాండ్‌, బ్లూటూత్‌, ఏఆర్‌ టెక్నాలజీ ద్వారా ఆ వస్తువులు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. లొకేషన్‌ వివరాలు ఫోన్‌ తెరపైన కూడా చూసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ట్యాగ్‌ బ్యాటరీ రెండేళ్లు పని చేస్తుందంటోంది తయారీదారు. ఇది వాటర్‌, డస్ట్‌ ప్రూఫ్‌ పరికరం. ఒకవేళ ఫోన్‌తో అనుసంధానం తెగిపోతే ఆటోమేటిగ్గా ఓనర్‌ సమాచారం, ఫోన్‌ నెంబర్‌ ఈ డివైజ్‌పై కనిపిస్తాయి. స్నేహితులు, ప్రేమికులకు ఇదొక మంచి బహుమతిగా ఇవ్వొచ్చు. ఏమంటారు?
ధర రూ.2,496


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు