వింటాం.. పంపలేం

వాట్సప్‌ లేకుండా యూత్‌కి రోజు గడవని రోజులివి. అంతగా వాళ్లకి దగ్గరైనా.. రోజుకో కొత్త ఫీచర్‌ని జోడిస్తూనే ఉంది ఈ మెసేజింగ్‌ యాప్‌. తాజాగా ‘వ్యూ వన్స్‌’ వాయిస్‌ నోట్‌లను త్వరలోనే తీసుకురానున్నామని ప్రకటించింది.

Published : 21 Oct 2023 00:05 IST

సందర్భం 

వాట్సప్‌ లేకుండా యూత్‌కి రోజు గడవని రోజులివి. అంతగా వాళ్లకి దగ్గరైనా.. రోజుకో కొత్త ఫీచర్‌ని జోడిస్తూనే ఉంది ఈ మెసేజింగ్‌ యాప్‌. తాజాగా ‘వ్యూ వన్స్‌’ వాయిస్‌ నోట్‌లను త్వరలోనే తీసుకురానున్నామని ప్రకటించింది. తాము పంపిన వాయిస్‌ మెసేజ్‌లు అవతలివాళ్లు ఒక్కసారి మాత్రమే వినాలనుకునే యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్‌ తీసుకు రానున్నారు. వ్యక్తిగత గోప్యతలో భాగంగా ఈ ఫీచర్‌ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందేశాలు డౌన్‌లోడ్‌ చేయడానికి, ఫార్వర్డ్‌ చేయడానికి, ఇతరులతో పంచుకోవడానికి వీలుండదు. ఒక్కసారి మాత్రమే వినగలుగుతారు. ఇప్పటికే ఫొటోలు పంపడానికి సైతం ఈ తరహా ఫీచర్‌ అందుబాటులో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని