పంచుకుందాం

జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం హానికరమట...అందుకేగా.. నీ మీద ఇంత శ్రద్ధ!

Updated : 18 Nov 2023 03:28 IST

జ్ఞానం లేకపోవడం కన్నా
శ్రద్ధ లేకపోవడం హానికరమట...
అందుకేగా.. నీ మీద ఇంత శ్రద్ధ!


సంతోషాన్ని మించిన సంపద లేదంటారు
నేను సంపన్నుడిని కావాలంటే..
నువ్వు రోజూ కనిపించాల్సిందే!


నిరీక్షణ మరీ ఇంత భారమా..
నిన్ను చూసి అప్పుడే..
అ..ర..వై.. సెకన్లు!


ఒకప్పుడు నిశ్శబ్దం, నిరాశతోనే
నా స్నేహం...
నీ రాకతో అవి మాయం!


కిశోర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని