వచ్చేస్తోంది.. సంగీత సునామీ

మ్యూజిక్‌ ప్రియుల కోసం ముంబయిలో ఓ సంగీత సునామీ రాబోతోంది. బాలీవుడ్‌ క్లాసిక్‌, ఫోక్‌, పాప్‌... ఎవరికి నచ్చింది వాళ్లకి ఇచ్చేందుకు గాయకులు సిద్ధమవుతున్నారు. వేల వాట్ల వెలుగులు..

Updated : 25 Nov 2023 01:49 IST

మ్యూజిక్‌ ప్రియుల కోసం ముంబయిలో ఓ సంగీత సునామీ రాబోతోంది. బాలీవుడ్‌ క్లాసిక్‌, ఫోక్‌, పాప్‌... ఎవరికి నచ్చింది వాళ్లకి ఇచ్చేందుకు గాయకులు సిద్ధమవుతున్నారు. వేల వాట్ల వెలుగులు.. భారీ వేదికలు.. లక్షల మంది అభిమానులతో ముంబయి నగరం అందుకు ముస్తాబవుతోంది. హరిహరన్‌, కైలాష్‌ ఖేర్‌, సోనూ నిగమ్‌, సిద్‌ శ్రీరాంలాంటి టాప్‌ సింగర్లు.. తమ ప్రదర్శనతో శ్రోతల్ని మెప్పించనున్నారు. డీజేలు దిమిత్రీ వెగాస్‌ అండ్‌ లైక్‌ మైక్‌.. పాప్‌సింగర్ల బృందం వెస్ట్‌లైఫ్‌, సన్‌బర్న్‌ అభిమానుల్ని స్వర సంద్రంలో ఓలలాడించనున్నారు.

వేదిక: ముంబయిలోని ఎంపిక చేసిన వేర్వేరు ప్రాంగణాలు

తేదీలు: నవంబరు 24 నుంచి డిసెంబరు 7 వరకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని