వచ్చేసింది శాంటా జీపీటీ

క్రిస్మస్‌ అంటే.. కానుకలు ఇచ్చిపుచ్చుకునే సందర్భం. మరి ఎవరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి? వాళ్లనెలా సంతోషపెట్టాలి.. ఇవన్నీ సందేహాలుంటే ‘శాంటా జీపీటీ’ని అడగొచ్చు.

Published : 09 Dec 2023 00:11 IST

క్రిస్మస్‌ అంటే.. కానుకలు ఇచ్చిపుచ్చుకునే సందర్భం. మరి ఎవరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి? వాళ్లనెలా సంతోషపెట్టాలి.. ఇవన్నీ సందేహాలుంటే ‘శాంటా జీపీటీ’ని అడగొచ్చు. కృత్రిమ మేధతో పెను సంచలనాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీ నిర్వాహకులే దీన్నీ తయారు చేశారు. చాట్‌జీపీటీ ప్లస్‌ సబ్‌స్క్రైబర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రశ్నలకు సమాధానాలు, బహుమతుల సూచనలే కాదు.. స్నేహితులు, ప్రేమికులు, పెద్దలు ఇలా ఎవరికి తగ్గట్టు అయినా.. కవితలూ రాసి పెడుతుందీ శాంటాజీపీటీ. ఈ క్రిస్మస్‌కి మీరూ ప్రయత్నించి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని