రింగ్‌తో పేమెంట్‌

పక్క వీధిలో పచారీ సామాను కొన్నా.. గాళ్‌ఫ్రెండ్‌ కోసం షాపింగ్‌ చేసినా.. పర్సులోంచి కరెన్సీ నోటు తీసి బిల్లులు చెల్లించే కాలం ఎప్పుడో పోయింది

Published : 23 Dec 2023 00:52 IST

పక్క వీధిలో పచారీ సామాను కొన్నా.. గాళ్‌ఫ్రెండ్‌ కోసం షాపింగ్‌ చేసినా.. పర్సులోంచి కరెన్సీ నోటు తీసి బిల్లులు చెల్లించే కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు లావాదేవీలన్నీ ప్లాస్టిక్‌ కార్డులు.. ఫోన్‌పేలే. వీటి లాక్‌లు తీసి, పాస్‌వర్డ్‌లు కొట్టడానికీ సమయం వృథా ఎందుకనుకున్నారేమో.. సెల్‌ఫోన్‌కి రింగ్‌ ఇచ్చినంత సమయంలోనే వేలికి తొడిగిన రింగ్‌తో డబ్బులు చెల్లించే ఓ సరికొత్త గ్యాడ్జెట్‌ని తీసుకొచ్చారు. దీన్ని రూపొందించింది అచ్చంగా మనవాళ్లే. ఆ రింగ్‌ గ్యాడ్జెట్‌ పేరు ‘7 రింగ్‌’. ఇది భారత్‌లోనే మొదటి కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్‌ వేరబుల్‌ రింగ్‌. నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ చిప్‌ని ఇందులో అమర్చి, దాన్ని మనం పేమెంట్‌ చేయాలనుకునే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ... అనుసంధానం చేస్తారు. పీవోఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) దగ్గర అలా ట్యాప్‌ చేస్తే చాలు. బిల్లుకి సరిపడా మొత్తం కట్‌ అవుతుంది. దీన్ని జిర్కోనియా సెరామిక్‌తో తయారు చేశారు. దుమ్ము పట్టడం, నీటిలో తడవడం లాంటి బాధలేం ఉండవు. ఛార్జింగ్‌ చేయాలనే బెంగా అక్కర్లేదు. చూడటానికి స్టైలిష్‌ రింగ్‌లా కనిపిస్తుంది. మొత్తం ఏడు పరిణామాల్లో లభిస్తోంది. భవిష్యత్తులో దీని వినియోగం పెద్దఎత్తున ఉంటుందంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని