ఫోన్ వదిలేస్తే..రూ.8 లక్షలు
ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు. కానీ మీ స్మార్ట్‌ఫోన్ ఎలాంటిదైనా నెల రోజులపాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షలు ఇస్తామంటోంది ఓ కంపెనీ.
ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు. కానీ మీ స్మార్ట్‌ఫోన్ ఎలాంటిదైనా నెల రోజులపాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షలు ఇస్తామంటోంది ఓ కంపెనీ. చాలామంది అమెరికన్లు ఈ పనిలోనే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ అతి వాడకంతో పిల్లల చదువు పాడవుతోంది.. యువత చెడుదారి పడుతున్నారు అని చాలామంది అనుకుంటారు. అమెరికాకు చెందిన ‘సిగ్గీస్ డైరీ’ అనే కంపెనీదీ ఇదే అభిప్రాయం. అక్కడి కుర్రకారుని కొద్దిరోజులైనా స్మార్ట్ఫోన్లకు దూరం చేయడానికి ఓ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగానే స్మార్ట్‌ఫోన్‌ని ముప్ఫై రోజులు వాడకుండా ఉన్నవారికి రూ.8లక్షలు ఇస్తానని ప్రకటించింది. దీనికోసం ముందు కంపెనీ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. డిజిటల్ డిటాక్స్ అవసరం తెలియజేస్తూ ఓ వ్యాసం రాయాలి. పోటీకి ఎంపికైన వారికి ఓ కీప్యాడ్ ఫోన్, సిమ్ వాళ్లే ఇస్తారు. స్మార్ట్‌ఫోన్‌ని పక్కనపెట్టి దాన్ని మాత్రమే ఉపయోగించాలి. విజయవంతంగా నెలపాటు అలా చేసినవారికి ఆ మొత్తం అందిస్తామంటోంది కంపెనీ. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తైంది. త్వరలోనే పోటీ మొదలవుతుంది. ఇది ఆన్లైన్లో బాగా వైరల్ కావడంతో.. మాకూ ఇలాంటి అవకాశం వస్తే బాగుండు అంటున్నారు మనోళ్లు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్‌రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే