మనకొద్దు.. లేడీగాగా సమస్య

పాప్‌ సింగర్‌ లేడీ గాగాకి ప్రపంచమంతా అభిమానులే. తను పాడితే కుర్రకారు ఊగిపోతారు. ఆమె ఆడితే అనుసరిస్తూ స్టెప్పులేస్తారు. తన కచేరీ కనీస టికెట్‌ ధర రూ.20వేలతో మొదలై, రూ.4లక్షల వరకు ఉంటుంది.

Updated : 27 Jan 2024 11:35 IST

పాప్‌ సింగర్‌ లేడీ గాగాకి ప్రపంచమంతా అభిమానులే. తను పాడితే కుర్రకారు ఊగిపోతారు. ఆమె ఆడితే అనుసరిస్తూ స్టెప్పులేస్తారు. తన కచేరీ కనీస టికెట్‌ ధర రూ.20వేలతో మొదలై, రూ.4లక్షల వరకు ఉంటుంది. అంతలా కాసులు కురిపించే ఓ కాన్సర్ట్‌ని ఉన్నఫళంగా రద్దు చేసుకుంది లేడీ గాగా. కారణమేంటి అంటే.. ‘ఫైబ్రోమ్యాల్గియా’ అంది. ఆమె పుణ్యాన ఈ పదం ఇప్పుడు జనంలోకి వెళ్లిందిగానీ.. ఈ సమస్య యువ ఉద్యోగుల్లో తీవ్రంగా ఉందంటున్నాయి అధ్యయనాలు. కండరాలు, ఎముకలు, కీళ్లలో విపరీతమైన నొప్పి కలగడమే ఈ ‘ఫైబ్రోమ్యాల్గియా’. దీని కారణంగా ఒంట్లో నిస్సత్తువ.. వేగంగా ఆలోచించ లేకపోవడం.. నరాల బలహీనత.. నిద్రలేమి.. తదితర ఫలితాలుంటాయట. గంటలకొద్దీ కంప్యూటర్లు, సెల్‌ఫోన్లకే అతుక్కుపోవడం.. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండటం.. కారణంగానే ఈ సమస్య మొదలవుతుంది అంటున్నారు వైద్య నిపుణులు. పని మధ్యలో ఎక్కువగా విరామం తీసుకోవడం.. పనివేళల్ని తగ్గించుకోవడమే దీనికి పరిష్కారం అంటున్నారు. అయితే కొందరిలో వయసు పెరుగుతున్నకొద్దీ సహజంగానే ఈ సమస్య ఏర్పడుతుందట. దాన్ని ఎలాగూ తప్పించుకోలేంగానీ.. చేజేతులా లేడీ గాగాలా సమస్యని కొని తెచ్చుకోవద్దు. ఏమంటారు గాయ్స్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని