వాడికి బిల్డప్‌ ఎక్కువ..

మా సెకండియర్‌కి, థర్డ్‌ఇయర్‌కీ తరచూ గొడవలే! థర్డ్‌ఇయర్‌కి ఎస్‌ ప్రణీత్‌ నాయకుడు. తనకి తల పొగరు ఎక్కువ. జూనియర్లు అని మమ్మల్ని చులకనగా చూసేవాడు.

Published : 03 Feb 2024 01:00 IST

కాలేజీ కహానీలు

మా సెకండియర్‌కి, థర్డ్‌ఇయర్‌కీ తరచూ గొడవలే! థర్డ్‌ఇయర్‌కి ఎస్‌ ప్రణీత్‌ నాయకుడు. తనకి తల పొగరు ఎక్కువ. జూనియర్లు అని మమ్మల్ని చులకనగా చూసేవాడు. బిల్డప్‌ ఎక్కువ కావడంతో తనని మేం బిల్డప్‌ ప్రణీత్‌.. బి ప్రణీత్‌ అని పిలిచేవాళ్లం. ఓసారి మేం క్యాంటీన్‌ దగ్గర్లో ఉండగా.. ఒక విద్యార్థి, వాళ్ల నాన్న మా దగ్గరకు వచ్చారు. ఆ పెద్దాయన బ్యాంకు ఉద్యోగి. బదిలీ కావడంతో వాళ్ల అబ్బాయిని మా కాలేజీలో చేర్చడానికి తీసుకొచ్చారట. ఆఫీసు ఎక్కడుందని అడిగారు. మేం దారి చూపిద్దాం అనుకునేలోపే ప్రణీత్‌ వాళ్ల గ్యాంగుతో కనిపించాడు. వెంటనే నాకో ఉపాయం తట్టింది. ‘ఆ గుంపులో బి ప్రణీత్‌ అని ఉంటాడు. వెళ్లి అడిగితే ఆఫీసుకు తీసుకెళ్తాడు’ అని వాళ్లతో చెప్పా. పాపం.. వాళ్లకేం తెలుసు? వెళ్లి ‘బాబూ మీలో బి ప్రణీత్‌ ఎవరు?’ అని అడిగారాయన. వాడికి తిక్కరేగి అరిచేశాడు. మేం నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాం.

 ఆర్‌.శ్రీకర్‌, ఇబ్రహీంపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని