చెదరని జ్ఞాపకాలు..

ముంతాజ్‌ జ్ఞాపకార్థం ఆగ్రాలో తాజ్‌మహల్‌ కట్టాడు షాజహాన్‌. ఈ విషయం.. దాదాపు అందరికీ తెలుసు. ఇదొక్కటేనా... ఇలాంటి చారిత్రక కట్టడాలు మనదేశంలో మరికొన్ని ఉన్నాయి.

Published : 10 Feb 2024 00:24 IST

ముంతాజ్‌ జ్ఞాపకార్థం ఆగ్రాలో తాజ్‌మహల్‌ కట్టాడు షాజహాన్‌. ఈ విషయం.. దాదాపు అందరికీ తెలుసు. ఇదొక్కటేనా... ఇలాంటి చారిత్రక కట్టడాలు మనదేశంలో మరికొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా..

రాణీ కీ వవ్‌: గుజరాత్‌లోని పఠాన్‌లో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడంగా గుర్తింపు పొందింది. ఇది సరస్వతి నది ఒడ్డున ప్రపంచంలో అత్యంత ప్రత్యేకంగా నిర్మించిన మెట్ల బావి. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. తన భర్త ఒకటో భీమదేవ రాజు స్మారకంగా రాణి ఉదయమతి నిర్మించింది.

హుమాయూన్‌ టూంబ్స్‌: దిల్లీలో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇది. మొఘల్‌ రాజు హుమాయూన్‌ తన మొదటి భార్య బేగా బేగమ్‌ గుర్తుగా క్రీ.శ.1569లో నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేశాడు.

అబ్దుర్‌ రహీం ఖాన్‌ ఈ ఖానా టూంబ్‌: తాజ్‌మహల్‌ కట్టడానికి ముందే.. అబ్దుర్‌ రహీం ఖాన్‌ అనే రాజు తన భార్య మహ్‌బాను స్మారకార్థం 1598లో దిల్లీలో ఈ కట్టడాన్ని పూర్తి చేశారు. రహీందాస్‌గా పిలిచే ఈయన అక్బర్‌ చక్రవర్తి ఆస్థానంలో ఒకరు.

బీబీ కా మఖ్బారా: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉంది. దీన్ని తాజ్‌ ఆఫ్‌ దక్కన్‌గా కూడా పిలుస్తారు. ఔరంగజేబ్‌ మొదటి భార్య దిల్రాస్‌ బాను బేగమ్‌ జ్ఞాపకార్థం తెల్లని పాలరాతితో 1653లో నిర్మించారు. ఇది తాజ్‌మహల్‌ని పోలి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని