ఓ నా రవ్వల రాణీ...

నిన్ను మొదటిసారి భ్రమరాంబ థియేటర్‌ దగ్గర మొదటి షో అప్పుడు చూశాను. అప్పట్నుంచే నిజం సినిమాలో మహేశ్‌ బాబులా అమాయకుడిలా ఉండే నేను జల్సాలో పవన్‌కల్యాణ్‌లా గాల్లో తేలిపోతున్నా.

Published : 02 Mar 2024 00:18 IST

నిన్ను మొదటిసారి భ్రమరాంబ థియేటర్‌ దగ్గర మొదటి షో అప్పుడు చూశాను. అప్పట్నుంచే నిజం సినిమాలో మహేశ్‌ బాబులా అమాయకుడిలా ఉండే నేను జల్సాలో పవన్‌కల్యాణ్‌లా గాల్లో తేలిపోతున్నా. నీ చూపులతో ఏ మాయ చేశావో తెలియదుగానీ.. నా మనసంతా నువ్వే నిండిపోయావు. ఇప్పుడు నా పరిస్థితి నువ్వు లేక నేను లేను అన్నట్టుగా తయారైంది. నీ పరిచయం కాకముందు బిచ్చగాడులా ఉన్న నా వాలకం.. నన్నంతా ‘సోగ్గాడులా తయారవుతున్నావు’ అనే స్థాయికి చేరింది. పనులన్నీ మానేసి నీ చుట్టే నేను ఆవారాలా తిరుగుతుంటే.. నువ్వు మాత్రం అతడులో త్రిషలా తెగ పోజు కొడుతున్నావు. నువ్వనుకుంటున్నట్టు నేనేం పోకిరిని కాదు. ఈ అబ్బాయి చాలా మంచోడు అని అందరితో అనిపించుకునే బుద్ధిమంతుడిని. అది అర్థం చేసుకొని నా ప్రేమకు పచ్చజెండా ఊపితే నా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌. అది కాదని తిరస్కరిస్తే.. ప్రేమిస్తే సినిమాలో హీరోలా పిచ్చివాడిలా అయిపోతా. ఇకనైనా కరుణించి డార్లింగ్‌ అని ఒక్కసారి పిలువు. రెక్కలగుర్రం కట్టుకొని నీ దగ్గరికి వచ్చేస్తాను. అన్నట్టు అందరికీ ఆదివారం హాలీడే.. నాకు మాత్రం నీతో మాట్లాడిన ప్రతిరోజూ హ్యాపీడేస్‌నే. చెప్పాలంటే ఇప్పుడు నా ఊపిరి నువ్వే. ఇకనైనా నా చెంత చేరితే.. మనం ప్రేమికులుగా చలామణి అవుదాం. నా పేరు చివర నీ రాణీ పేరు జోడించి రాజారాణిలా చెలరేగిపోదాం.

 - బి.రాజు, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని