వాట్సప్‌ వలలో చిక్కొద్దు

వాట్సప్‌ వాడకుండా తెల్లారని రోజులివి. ముఖ్యంగా యువతకి. అంతగా అల్లుకుపోయిన ఈ సామాజిక మాధ్యమంలో ఈమధ్య కాలంలో హ్యాకింగ్‌లు పెరిగిపోతున్నాయి.

Published : 09 Mar 2024 00:04 IST

వాట్సప్‌ వాడకుండా తెల్లారని రోజులివి. ముఖ్యంగా యువతకి. అంతగా అల్లుకుపోయిన ఈ సామాజిక మాధ్యమంలో ఈమధ్య కాలంలో హ్యాకింగ్‌లు పెరిగిపోతున్నాయి. ఈ అనవసర అనర్థాల బారిన పడకుండా  ఈ చిట్కాలు పాటించండి.

  • మన వాట్సప్‌ ఖాతాను ఎవరూ హ్యాక్‌ చేయకుండా.. వేరే ఫోన్లలో మన నంబర్‌ లాగిన్‌ కాకుండా ఉండాలంటే.. ‘టూ స్టెప్స్‌ వెరిఫికేషన్‌’ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ‘అకౌంట్‌’ సెక్షన్‌లో ఈ ఫీచర్‌ ఉంటుంది. ఆరంకెల పిన్‌, ఓటీపీ నంబర్‌.. ఈ రెండూ దాటి వాట్సప్‌ ఇతరులు వాడటం కష్టమే. వాట్సప్‌కి మాల్వేర్‌ లింక్‌లు సైతం పంపి వాటిని తెరవగానే బ్యాంక్‌ ఖాతాలు, వ్యక్తిగత సమాచారం హ్యాక్‌ చేస్తున్నారు. పొరపాటున కూడా ఇలాంటి లింక్‌లను తెరవొద్దు. అపరిచిత కాల్స్‌కి సమాధానం ఇవ్వొద్దు.
  • థర్డ్‌ పార్టీ యాప్‌లు, వెబ్‌ ద్వారా సైతం వాట్సప్‌ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. కానీ ఇలా చేయడం ఎప్పటికీ సురక్షితం కాదు. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంచిన అధికారిక యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వీటిలోనే భద్రతా ఫీచర్లు ఎక్కువ.
  • మన సందేశాలు, ఫొటోలు, వీడియోలు ఎవరి కంటా పడకుండా ఉండాలంటే ‘డిసప్పియరింగ్‌’ ఫీచర్‌ని ఆన్‌ చేయాలి. రోజు, వారం, నెలా.. ఇలా సమయం గడవగానే చాట్‌ ఆటోమేటిగ్గా డిలీట్‌ అవుతుంది. వ్యక్తిగతంగా ఎవరిదైనా చాట్‌ గోప్యంగా ఉంచాలనుకుంటే వాళ్లకు సంబంధించి చాట్‌ లాక్‌ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేయాలి.
  • ఈమధ్యకాలంలో అపరిచితుల నుంచి న్యూడ్‌ వీడియోకాల్స్‌ చేసుకుందామంటూ ఆహ్వానాలు వస్తున్నాయి. రెచ్చిపోయి అలా చేయగానే వాటిని రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడే స్కామ్‌ ఎక్కువ అవుతోంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. ‘సైలెన్స్‌ అన్‌నోన్‌ నంబర్‌’ని యాక్టివేట్‌ చేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని