కొంటె కొటేషన్‌

ఎండలో కందకుండా పాదాలు... చెప్పులపై వేస్తున్నావా ఆసనాలు!

Published : 23 Mar 2024 00:22 IST


 • ఎండలో కందకుండా పాదాలు... చెప్పులపై వేస్తున్నావా ఆసనాలు!

ఎ.అభిరామ్‌, దూసి


 • నమస్కారం చెప్పులు... మళ్లీ చెయ్యను ఏ తప్పులూ!

ఎ.శ్రీనివాసరావు, విజయవాడ


 • బీచ్‌లో యోగా... చేస్తున్నావు మహా బాగా!

ఇ.వి.ఎస్‌.దీపక్‌, బెంగళూరు


 • పాదరక్షల ట్రిక్కు... పాప చేస్తేనే కిక్కు!

ఇ.ఉదయకుమార్‌, అనంతపురం


 • తగదోయ్‌ భామా... ఈ ఒంటికాలి ధీమా!

వెల్ముల రాంరెడ్డి, పూడూరు


 • జలధిలో యోగాసనం... జోళ్లే నీకు సింహాసనం!

సి.జి.వెంకటేశులు, ముప్పలకుంట


 • బాలికా.. భలే నీ ఆసనం... పెంచేస్తుందేమో ఇది యవ్వనం!

వేణు మాకాటి, ఈమెయిల్‌


 • అదిరింది కెమెరా యాంగిల్‌... అలలొస్తే కడలిలో మింగిల్‌!

నివాస్‌ ఓట్ర, తిరుపతి


 • స్టాండ్‌పై అష్టాంగం... యోగా బేబీ సాహసం!

వసీం, ఈమెయిల్‌


 • సాగించు యోగా సాధన... పాదరక్షలే నీకు ఆలంబన!

అల్లాడ విమోచన్‌, దూసి


 • ఒంటికాలితో యోగా... దొరకలేదా ఇంకెక్కడా జాగా!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని