జీవితాంతం సిగ్గు పడాల్సిందే!

 ఈ సరదా సన్నివేశం మా డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో జరిగింది. మా పొలిటికల్‌ సైన్స్‌ క్లాస్‌ అంటే అందరికీ బోర్‌. ఆ లెక్చరర్‌ పాఠం చెబుతున్నప్పుడు అందరం ఫోన్లలో మునిగిపోయే వాళ్లం లేదా కబుర్లు చెప్పుకునేవాళ్లం.

Updated : 13 Apr 2024 04:07 IST

కాలేజీ కహానీ

 ఈ సరదా సన్నివేశం మా డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో జరిగింది. మా పొలిటికల్‌ సైన్స్‌ క్లాస్‌ అంటే అందరికీ బోర్‌. ఆ లెక్చరర్‌ పాఠం చెబుతున్నప్పుడు అందరం ఫోన్లలో మునిగిపోయే వాళ్లం లేదా కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఓరోజు కూడా అలాగే యథావిధిగా చేస్తున్నాం. కాసేపయ్యాక సర్‌ పాఠం చెబుతూ చెబుతూ నా దగ్గరికి వచ్చారు. ‘బాబూ.. నేను చెప్పే పాఠం వింటూ.. పుస్తకంలో కూడా చూడమని క్లాసు మొదలయ్యే ముందే చెప్పానుగా. అలాగే చేస్తున్నావా..లేదా?’ అనడిగారు. ఆయన ఎప్పుడూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరులే అనే తేలికభావంతో ‘హా.. చేస్తున్నాను సర్‌’ అన్నాను.

నిజానికి నేను కనీసం పుస్తకం కూడా తెరవలేదన్న విషయం నాకు తెలుసు.  తేలిగ్గా తీసుకుంటారు అనుకున్న ఆయన.. ఈసారి మాత్రం  చాలా కోపంగా నా డెస్క్‌లో నుంచి పుస్తకం తీశారు. చెబుతున్న పాఠం పేజీ తెరిచి మరీ నా చేతిలో పెట్టారు. ‘మరీ ఇన్ని అబద్ధాలా? నేను చెబుతోంది కనీసం విన్నట్టు అయినా యాక్టింగ్‌ చేయండ్రా. ఇప్పుడు వినకపోతే.. ఉద్యోగాలు రాక జీవితాంతం యాక్టింగ్‌ చేసి బతకాల్సిన టైం వస్తుంది’ అని అన్నారు. ఆ మాటతో చాలామంది నవ్వుల్లో మునిగిపోయినా.. నాతోపాటు కొందరం సిగ్గుగా కూడా ఫీలయ్యాం.
ఆర్‌.రాజేందర్‌, వరంగల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని