నిద్రపోయే నాయకుడు..

మా డిగ్రీ మొదటి సంవత్సరంలో జరిగిందిది. స్పెషల్‌ క్లాసులలో అదే మా మొదటి క్లాస్‌. సర్‌ ఇంకా రాలేదు.

Published : 27 Apr 2024 00:03 IST

మా డిగ్రీ మొదటి సంవత్సరంలో జరిగిందిది. స్పెషల్‌ క్లాసులలో అదే మా మొదటి క్లాస్‌. సర్‌ ఇంకా రాలేదు. కొంతమంది కబుర్లు చెప్పుకుంటుంటే.. ఇంకొందరు ఫోన్లలో బిజీగా ఉన్నారు. వెనక బెంచీలో మా నవీన్‌గాడు మాత్రం నిద్ర పోతున్నాడు. ఇంతలో సర్‌ రానే వచ్చారు. వస్తూనే.. ఎప్పట్లాగే ‘మీలో క్లాస్‌లీడర్‌గా ఎవరు ఉంటార్రా’ అన్నారు. అందరూ కొత్త కావడంతో ఎవరూ ఉత్సాహం చూపలేదు. పైగా భయంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ‘ఎవరో ఒకరు రండిరా.. ఆలస్యం అవుతోంది’ అని గట్టిగా అరిచారు సర్‌. మేం ఇంకా ఆలోచనలోనే ఉన్నాం. ఇంతలో నవీన్‌ పక్కనున్న మనోజ్‌.. నిద్రపోతున్న నవీన్‌ని గట్టిగా తట్టి లేపి, ‘ఒరేయ్‌ సర్‌ నిన్ను పిలుస్తున్నారు. త్వరగా లే’ అన్నాడు. మావాడు ఉలిక్కిపడి లేచి.. ఆయన దగ్గరికి వెళ్లాడు. ‘ఓకే.. నవీన్‌ ఈజ్‌ యువర్‌ న్యూ క్లాస్‌ లీడర్‌’ అని ప్రకటించారు సర్‌. ‘నిద్రపోయేవాడు లీడరా?’ అని గుంపులో నుంచి ఒకడు అరవడంతో క్లాసంతా నవ్వుల్లో మునిగిపోయింది. మావాడి మొహమేమో వాడిపోయింది.

భువన్‌ప్రకాశ్‌ రెడ్డి, విజయవాడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని